Reading Time: < 1 minute
Police Age Relaxation Telangana Go 2026

TSLPRB : తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. పోలీస్‌, ఫైర్‌, జైళ్లు, ఎక్సైజ్‌, ఎస్పీఎఫ్‌, ఫారెస్ట్‌ తదితర యూనిఫాం సర్వీసుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌కు గరిష్ఠ వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఐదేళ్ల వయోసడలింపునకు అదనంగా ఈ రెండేళ్ల సడలింపు వర్తించనుంది. దీంతో పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లు, ఎస్సై పోస్టులకు 37 ఏళ్లు కానుంది. నిరుద్యోగ యువత నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా జీవోతో పోలీస్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మరింత మంది అభ్యర్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొనే అవకాశం లభించనుంది.