
టాప్ హీరోల నుంచి ఏడాదికి రెండు సినిమాలు.. ఆ ఊహ ఎంత బాగుందో కదా..? కానీ ఏం చేస్తాం మన హీరోలేమో ప్యాన్ ఇండియా, క్వాలిటీ అంటూ ఒక్కో సినిమాకు మూడేళ్లు తీసుకుంటున్నారు. కానీ ఇలాంటి సమయంలోను కొందరు హీరోలు మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్నెళ్ళ గ్యాప్‌లోనే 2 సినిమాలు తీసుకొచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి అలా రాబోతున్న హీరోలెవరో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? చిరంజీవి మళ్లీ జోరు పెంచేసారు. 2026 సంక్రాంతికి రప్ఫాడించిన శంకరవరప్రసాద్ గారు.. అక్టోబర్ 16న విశ్వంభరతో రానున్నారు. అలాగే అదొచ్చిన మూడు నెలల్లోపే 2027 సంక్రాంతికి బాబీ తెరకెక్కిస్తున్న మెగా 158తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అంటే ఏడాది తిరిగేలోపే మెగాస్టార్ నుంచి 3 సినిమాలు వచ్చినట్లే కదా..! అలాగే వెంకటేష్ కూడా ఇదే స్పీడ్ మెయింటేన్ చేస్తున్నారు. అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబం వస్తుంటే.. సంక్రాంతి బరిలో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఉంది. ఇందులో కళ్యాణ్‌రామ్ కూడా నటిస్తున్నారు. ప్రభాస్ సైతం డిసెంబర్ 3న ఫౌజీ సినిమాతో రానున్నారు.. ఇదొచ్చిన నాలుగు నెలలకే 2027 మార్చి 5న స్పిరిట్ సినిమాతో బాక్సాఫీస్ మీద దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు సినిమాలపై అంచనాలు నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. విజయ్ దేవరకొండ కూడా షార్ట్ గ్యాప్‌లోనే రెండు సినిమాలతో రానున్నారు. నవంబర్‌లో రణబాలి సినిమా రానుంది.. అలాగే 2027 ఫిబ్రవరిలో రౌడీ జనార్ధన రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇక రవితేజ ఆగస్ట్ 21న ఇరుముడితో మాయ చేయడానికి వచ్చేస్తున్నారు. అలాగే 2027 సంక్రాంతికి హసిత్ గోలీ దర్శకత్వంలో శ్రీ విష్ణుతో ఓ హిలేరియస్ మల్టీస్టారర్‌తో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మాస్ రాజా. నాని కూడా అంతే.. సెప్టెంబర్ 24న ప్యారడైజ్ విడుదల కానుంది. అక్టోబర్ నుంచి సుజీత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో మొదలుపెట్టి.. డిసెంబర్‌లోపు షూట్ పూర్తి చేసి సమ్మర్ 2027లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. శర్వానంద్ కూడా ఆగస్ట్ 28న భోగి సినిమాతో రానున్నారు.. అదొచ్చిన 5 నెలలకు 2027 సంక్రాంతికి శ్రీను వైట్ల సినిమాతో రానున్నారు. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్‌కు కలిసొచ్చే విషయమే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kajol: 34 ఏళ్ల తర్వాత కాజోల్ రూట్ మార్చేశారు.. ఇకపై అలాంటి పాత్రలే చేస్తానంటున్న స్టార్ హీరోయిన్!
Nani: ఆసక్తికరంగా నాని హీరోయిన్స్ సెలక్షన్
Shraddha Srinath: మూడు భాషల్లో హిట్లు.. అయినా అవకాశాలు కరువు! శ్రద్ధా శ్రీనాథ్ కెరీర్‌కు ఏమైంది?
Ritika Nayak: వరుస హిట్లతో టాలీవుడ్‌లో గోల్డెన్ హ్యాండ్‌గా మారిన యంగ్ బ్యూటీ.. ఎవరో తెలుసా?
Dhurandhar: థియేటర్లలో వేల కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ వరల్డ్ రికార్డ్! ‘ధురంధర్’ దుమ్మురేపుతోంది