Reading Time: < 1 minute

రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం.. సింధూ ఒప్పందం రద్దు.. పాకిస్తాన్పై కీలక వ్యాఖ్యలు

Caption of Image.

80 వ స్వాంతంత్ర్య దినోవ్సవం సందర్భంగా 2026 ఆగస్టు 14న జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రసంగం చేశారు. ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న దేశంతో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం నిర్ణయాకత్మక చర్య అని ఈ సందర్భంగా అన్నారు. 

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నవారికి ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. అదే విధంగా ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా పర్యవసానాలు ఎదుర్కోవాల్సిందేనని.. ఆపరేషన్ సింధూర్ ద్వారా సాయుధ బలగాలు చూపిన శౌర్యాన్ని గుర్తు చేశారు.

నక్సలైట్ల నిర్మూలన దేశం సాధించిన గొప్ప విజయమని ఈ సందర్భంగా చెప్పారు. బస్తర్ ప్రాంతంలో నక్సలిజం తగ్గి.. సాంస్కృతికంగా చాలా మార్పులువస్తున్నట్లు చెప్పారు. 

ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ భారత ఎకానమీ వృద్ధిలోనే ఉందని ఈ సందర్భంగా ముర్దు చెప్పారు. గత పదేళ్లలో దేశంలో 25 కోట్ల ప్రజలను పేదరికం నుంచి బయటవేసినట్లు చెప్పారు. 

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ న్యాయానికి దూరం కాకూడదని అన్నారు. పేదలకు కూడా న్యాయం అందాలని ఆకాంక్షించారు. జుడీషియల్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఆలోచించాలని సూచించారు.  

©️ VIL Media Pvt Ltd.