Reading Time: 2 minutes

నేను చేసిన తప్పు మీరు చేయకండి: మెక్సికో నుంచి కన్నీళ్లతో సిక్కు యువకుడి విజ్ణప్తి..వీడియో వైరల్

Caption of Image.

మెక్సికో నుంచి ఓ సిక్కు యువకుడు కన్నీళ్లతో విజ్ణప్తి చేస్తు్న్న వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.. నేను తప్పు చేశాను.. నేను చేసిన తప్పు మీరు చేయకండి..నాకు ఎదురైన పరిస్థితే మీకు ఎదురవచ్చు.. అంటూ యువతకు బాధతో విజ్ణప్తి చేస్తున్నాడు ఆ వీడియోలో..  ఓ బెడ్ పై కాళ్లు ముడుచుకుని పడుకొని చేతులు జోడించి ఏడుస్తూ ఆ విధంగా మేసేజ్ పంపించాడు. మెక్సికో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. ఇంకొకరికి తనలాంటి పరిస్థితి రాకూడదని.. తనలాగ అమెరికా వెళ్లేందుకు డుంకీ రూట్ ఎంచుకోవద్దని  ఈ వీడియో చేసినట్లు  చెబుతున్నాడు. ఇంతకీ అతను చేసిన తప్పేంటీ.. ఎందుకలా బోరున విలపిస్తున్నాడో తెలుసుకుందాం.. 

అమెరికా వంటి దేశాలకు చట్టబద్ధమైన వీసా, పాస్‌పోర్టు మార్గాల్లో కాకుండా రహస్యంగా వెళ్లేందుకు కొందరు వలసదారులు ఉపయోగించే అక్రమ మార్గాలను ‘డుంకీ రూట్’ అంటారు. ‘డుంకీ’ అనే పంజాబీ పదానికి ఒక చోటు నుంచి మరో చోటుకు గెంతుతూ వెళ్లడం అనే అర్థం.

ఈ మార్గంలో ఏజెంట్లు లేదా స్మగ్లర్లు పర్యాటక వీసాలు, నకిలీ డాక్యుమెంట్లు, అక్రమంగా సరిహద్దులు దాటడం వంటి చీఫ్ ట్రిక్స్ ఉపయోగిస్తారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.

అమెరికాకు వెళ్లే కొందరు భారతీయులు మొదట బ్రెజిల్, గయానా, ఈక్వెడార్, కొలంబియా వంటి దక్షిణ అమెరికా దేశాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి పనామా వైపు ప్రయాణిస్తారు. ఈ మార్గంలో కొలంబియా-పనామా మధ్య డారియన్ గ్యాప్ అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటి. దట్టమైన అడవులు, నదులు, కఠినమైన భూభాగం కారణంగా ఇక్కడ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. 

పనామా తర్వాత కోస్టారికా, నికరాగువా, హోండురాస్, గ్వాటెమాలా మీదుగా మెక్సికో చేరి, అక్కడి నుంచి అమెరికా సరిహద్దులోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తారు. ఏజెంట్లను బట్టి మార్గాలు మారుతుంటాయి. ఈ ప్రయాణం ప్రాణాలకు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

సరిగ్గా ఇదే మార్గాన్ని ఎంచుకొని  అమెరికా వెళ్లాలను కున్న సిక్కు యువకుడి చివరికి ఈ గతి పట్టింది. దీంతో తనలాగ ఎవరూ తప్పు చేయొద్దని చేతులు జోడించిమొక్కతూ విజ్ణప్తి చేయడం ఇంటర్నెట్ వైరల్  కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. 

©️ VIL Media Pvt Ltd.