Reading Time: 2 minutes

అర్ధరాత్రి లిఫ్ట్ అడిగి డ్రైవర్కు షాకిచ్చిన యువతులు.. ఏం చేశారో తెలిస్తే ఆలోచనలో పడతారు!

Caption of Image.

ఇద్దరు యువతులు.. అర్ధరాత్రి కారు ఆపి లిఫ్ట్ కావాలంటే.. పాపం నైట్ టైమ్.. డ్రాప్ చేద్దాంలే అని అనుకుంటాం కదా. పాపం ఆ క్యాబ్ డ్రైవర్ కూడా అదే పని చేశాడు. కానీ వాళ్లు ఇచ్చిన షాక్కు.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిందంటే నమ్మరు. 

ఈ ఘటన మహారాష్ట్ర కళ్యాణ్ లోని గోవింద్వాడి బైపాస్ రోడ్డు దగ్గర జరిగింది. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి బై పాస్ దగ్గర ఇద్దరు అమ్మాయిలు లిఫ్టు అడిగారు. రాత్రి పూట అమ్మాయిలు ఇబ్బంది పడతారని కారు ఆపాడు. లోపలికి ఎక్కిన అమ్మాయిలు.. కారు కాస్త మూవ్ అయ్యాక.. పది వేలు ఇవ్వమంటూ డిమాండ్ చేయటం మొదలు పెట్టారు. డబ్బులు ఇవ్వకుంటే పోలీస్ ఫిర్యాదు ఇస్తామని, కేసు పెడతామని బెదిరించారు. 

ఈ ఘటనలో ఇద్దరు యువతులపై డ్రైవర్ కోన్  పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. ఈ ఘటన తర్వాత అర్థరాత్రి టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ డ్రైవర్ల సేఫ్టీపై మరోసారి ఆందోళన మొదలైంది. 

 బలవంతం చేశావని కేసు పెట్టాలా..

బాధితుని పేరు సచిన్ షెండ్గే.. దివా దగ్గర ప్యాసెంజర్లను వదిలి మళ్లీ రిటన్ వస్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. గోవింద్వాడీ బైపాస్ టీ స్టాల్ దగ్గర ఇద్దరు యువతులు లిఫ్ట్ అడిగారు. బివండీ వెళ్లాలని చెప్పగా.. అంత దూరం వెళ్లనని మధ్యలోనే రూట్ మారతానని చెప్పాడు. అయితే నెక్స్ట్ జంక్షన్ దగ్గర దింపాల్సింది రెక్వెస్ట్ చేస్తే.. ఓకే ఎక్కండి అన్నాడు. దుర్గాడి జంక్షన్ వచ్చే ముందు.. పదివేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. అయితే వాళ్లకు భయపడకుండా డబ్బులు ఇవ్వకుండా..  డైరెక్ట్ పోలీసులకు ఫోన్ చేశాడు.

కారు నుంచి దూకేశారుగా..

బెదిరిస్తున్న అమ్మాయిల గురించి పోలీసులకు ఫోన్ చేసిన డ్రైవర్.. వాళ్ల బెదిరింపులను వీడియో తీస్తూ.. కారును పోలీస్ స్టేషన్ వైపు తిప్పాడు. అంతే సంగతులు జంప్ అయ్యేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఆ స్పీడ్ లో జంప్ చేయాలంటే భయంతో కాస్త ఆగారు. బాధితుని ఫోన్ తో బయల్దేరిన పోలీసులు.. ఎదురుగా వస్తుండటం చూసి డ్రైవర్ కార్ స్లో చేశాడు. అంతే సంగతులు.. బతికాం రా దేవుడా అంటూ.. కారు ఆగకముందే దూకేసి పారిపోయారు. 

©️ VIL Media Pvt Ltd.