ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శని గ్రహం జూలై 27 నుంచి వక్రగమనంలో సంచారం చేయనున్నాడు. ఇది పన్నెండు రాశులలో ఏ రాశి వారు అయితే ఏలినాటి శని ప్రభావంతో ఆర్థిక, అనారోగ్య, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారిపై మంచి, చెడు రెండు ప్రతి ఫలాలను అందించనున్నదంట. ఈ ప్రభావం ఆగస్టు వరకు ఉండనున్నదంట. కాగా ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది. వీరికి ఈ సమయం చాలా కీలకమైనది అని చెప్పాలి. అయితే శని వక్రగమనం, ఏలినాటి శని వలన ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కానీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదర్కునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అందువలన కుంభ రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.
మేష రాశి : మేష రాశి వారికి ఏలినాటి శని మొదటి దశ కొనసాగుతుంది. అయితే శని వక్రగమనం వలన వీరికి అంతగా ఇబ్బందులు ఎదురు కావు. వ్యాపారస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టడానికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఈ రాశి స్త్రీలకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా చాలా త్వరగా తొలిగిపోతాయి.
మీన రాశి : ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశిలో మీన రాశి కూడా ఉంది. ఈ రాశి వారికి శని వక్రగమనం వలన ఏలినాటి శని ప్రభావం చాలా సమస్యలను తీసుకొస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో వీరు అనేక సమస్యలు ఎదుర్కుంటారు. కుటుంబంలో కూడా కలతలు వస్తాయి. చాలా సమస్యలు వస్తాయి.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




