
రాశీ సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సోషల్ సెటైర్ డ్రామా ‘గాసిప్’. వైభవ్ కౌండిన్య దర్శకత్వంలో యతి నిర్మించారు. జూన్ 26న సినిమా విడుదలవుతోంది.మంగళ వారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. అతిథిగా హాజరైన దర్శకుడు సాయికిరణ్ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు. ఈ సందర్భంగా రాశీ సింగ్ మాట్లాడు తూ ‘ఇది చాలా స్పెషల్ మూవీ. ఒక చిన్న గాసిప్ ఓ వ్యక్తి జీ వితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో చూపించే కథ. నా ఫస్ట్ ఫీమేల్ లీడ్ కావడంతో బాధ్యతగా, భయంగా అనిపిస్తోంది’ అని చెప్పింది.
డైరెక్టర్ వైభవ్ కౌండిన్య మాట్లాడుతూ ‘మన జీవితాల్లో గాసిప్ అనేది సాధారణ విషయమే. కానీ మనం సరదాగా మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఇతరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమా రూపొందించాం.
ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతతో ఉండాలి అనే సందేశంతోపాటు ఆలోచింపజేసేలా ఈ చిత్రం ఉంటుంది’ అని చెప్పాడు. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాను అందరూ సపోర్ట్ చేయాలని నిర్మాత యతి అన్నారు. నటులు మహేష్ యడ్లపల్లి, గురు చరణ్, పృథ్వీరాజ్ పాల్గొన్నారు.