
జూబ్లీహిల్స్, వెలుగు: కుటుంబంలో వరుసగా జరిగిన విషాదాలను తట్టుకోలేక 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధి సయ్యద్‌నగర్ ఫస్ట్ లాన్సర్‌కు చెందిన రషీద్ పటేల్ టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఆయన భార్య అనారోగ్యంతో మృతిచెందింది.
అప్పటి నుంచి కొడుకు రెహమాన్ పటేల్(16) తీవ్ర మనోవేదనతో ఉంటున్నాడు. తర్వాత అమ్మమ్మ కూడా చనిపోవడంతో మరింత కృంగిపోయాడు. అమ్మ, అమ్మమ్మను కోల్పోవడంతో కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నాడు.
శనివారం మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన రెహమాన్.. తండ్రి నమాజ్ కోసం బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకున్నాడు. స్థానికులు బాలుడిని కిందకు దించి ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.