Reading Time: < 1 minute

టెంపరరీ లెక్చరర్లు, టీచర్ల  భర్తీకి దరఖాస్తులు

Caption of Image.

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని 9 సోషల్​వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో Aటెంపరరీ లెక్చరర్లు, టీచర్లు మొత్తం 32 పోస్టుల భర్తీకి అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు రీజినల్ కో ఆర్డినేటర్ రమాకల్యాణి తెలిపారు. జూనియర్ లెక్చరర్ (పీజీటీ/టీజీటీ/ స్పెషల్ టీచర్లు)కు27న లక్సెట్టిపేట గర్ల్స్ రెసిడెన్షియల్​లో నేరుగా దరఖాస్తులు స్వీకరించి, ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సర్టిఫికెట్ల పరిశీలన, తర్వాత డెమో క్లాస్ ఉంటుందని పేర్కొన్నారు.

కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఈడీ, టీజీటీలకు బీఎస్సీ, బీఏ, బీకాం 50 శాతం మార్కులు కలిగినవారు అర్హులన్నారు. జూనియర్ లెక్చరర్లకు రూ. 23,400, పీజీటీ, టీజీటీలకు రూ.18,200, స్పెషల్ టీచర్లకు రూ.14,200 వేతనం ఉంటుందని తెలిపారు. వివరాలకు 9704550167 నంబర్​ను సంప్రదించాలని సూచించారు.

©️ VIL Media Pvt Ltd.