
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సమ్మిట్ 2026లో సందడి చేశారు. ఈ వేదికపై ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చరణ్ భార్య ఉపాసన కూడా ఈ ఫ్రేమ్‌లో మెరిశారు. మోదీ విజన్‌ను కొనియాడుతూ చరణ్ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే, ఇదే సమ్మిట్‌లో చరణ్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి..
మోడీ విజన్ పై ప్రశంసలు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాని మోడీతో దిగిన అపురూపమైన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. రిపబ్లిక్ సమ్మిట్ 2026 వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం నాకెంతో గర్వంగా అనిపించింది. #ViksitBharat (వికసిత భారత్) పై ఆయనకున్న విజన్, అలాగే #IndiaFirst అనే ఆయన నినాదం నన్ను ఎంతగానో ప్రేరేపించాయి. పౌరులుగా దేశం పట్ల మనకున్న బాధ్యతను అవి మరోసారి గుర్తుచేశాయి అని పోస్ట్ చేశారు.
పాప్‌కార్న్ పంచాయితీ..
సమ్మిట్‌లో యాంకర్ అడిగిన ప్రశ్నలకు చరణ్ బదులిస్తూ.. భారతదేశంలో సినిమానే అందరికీ అందుబాటులో ఉండే అత్యంత చవకైన వినోదం. కానీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మరింత మందికి రీచ్ అవ్వాలంటే మల్టీప్లెక్స్‌లలో పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గించాలి అని అభిప్రాయపడ్డారు. దేశభక్తి నేపథ్యంలో వచ్చే ‘ధురంధర్’ లాంటి చిత్రాలను ప్రోత్సహించాలన్నారు. ఇక్కడే నెటిజన్లు చరణ్‌ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సార్.. పాప్‌కార్న్ ధరల కంటే మీ సినిమాల టికెట్ ధరలే మాకు చుక్కలు చూపిస్తున్నాయి.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
If popcorn prices come down a bit, it would be better.
— #RamCharan pic.twitter.com/ergLRw2gwF
— cinee worldd (@Cinee_Worldd) June 22, 2026
‘పెద్ది’ వసూళ్లు వర్సెస్ టికెట్ రేట్లు
ఇటీవలే బుచ్చిబాబు సన దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా వచ్చిన రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఈమూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించింది. సినిమా హిట్ అయిన మాట వాస్తవమే కానీ, ఈ సినిమా రిలీజ్ అప్పుడు భారీ బడ్జెట్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతులు తెచ్చుకున్నారు.
►ALSO READ | Padma Awards 2026: కనులపండువగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం
అయితే మొదటి వారం బెనిఫిట్ షోలు, ప్రీమియం టికెట్ రేట్లతోనే సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంటే, సినిమాను చవకైన వినోదం అనడం ఎంతవరకు కరెక్ట్? ఒక ఫ్యామిలీ థియేటర్‌కు వెళ్తే టికెట్లకే వేలల్లో ఖర్చవుతుంటే, ఇక పాప్‌కార్న్ ధరల గురించి మాట్లాడటం కాస్త కామెడీగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.