
కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే మాజీ భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం, సింగర్ కేనీషాతో రిలేషన్ వివాధాలతో ఇబ్బంది పడుతున్నాడు రవి మోహన్. ఆ వివాదం ఓ వైపు జరుగుతుండగానే ఇప్పడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. తన ఇంట్లో పనిచేసే ఇద్దరు మహిళలతో పాటు ఒక బాలుడిని అక్రమంగా బంధించారనే ఆరోపణలు రావడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. ఇంట్లో దొంగతనం జరిగిందనే అనుమానంతోనే వారిని గృహనిర్బంధం చేసినట్లు జయం రవిపై ఫిర్యాదు నమోదైంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. జయం రవి నివాసంలో పనిచేసే ఓ మహిళ సమయానికి ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త ఆందోళనకు గురయ్యాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో చెన్నైలోని నీలాంగరై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన నీలాంగరై పోలీసులు తక్షణమే స్పందించి నీలాంగరైలోని రవి మోహన్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ తనిఖీలు చేపట్టి జయం రవి ఇంట్లో బందీలుగా ఉన్న ఇద్దరు మహిళలను, సదరు బాలుడిని పోలీసులు విడిపించారు.ఈ ఘటనపై జయం రవికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇంట్లో ఏదైనా చోరీ జరిగిందని భావిస్తే బాధ్యతాయుతమైన పౌరుడిగా చట్టపరంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలే తప్ప, ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యక్తులను అక్రమంగా బంధించడం ఎంతమాత్రం సరికాదని సూచించారు. ఇప్పటికే వ్యక్తిగత జీవితంలో పలు వివాదాల వల్ల వార్తల్లో నిలిచిన జయం రవి.. ఇప్పుడు ఈ సరికొత్త లీగల్ ఇష్యూలో ఇరుక్కోవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.