
LIG Housing Scheme: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా అల్పాదాయ వర్గాలకు (LIG) క్యూర్ ఏరియాలో ప్రతిపాదించిన లక్ష ఫ్లాట్ల నిర్మాణ పథకానికి పేరు ఖరారునకు హౌసింగ్ బోర్డు వినూత్న ప్రయత్నం చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి మంచి పేరును నేరుగా ప్రజల నుంచే స్వీకరించాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. ప్రజల నుంచి వచ్చిన పేర్లలో ఉత్తమమైనదిగా ఎంపికైన పేరును సూచించిన వారికి ఒక లక్ష రూపాయల బహుమతిని అందచేస్తామని, సోషల్ మీడియా వేదికగా ఈ అంశంలో బహిరంగ పోటీని నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం ఒక ప్రకటనలో తెలిపారు.
క్యూర్ పరిధిలో అల్పాదాయ వర్గాల ప్రజల కోసం ప్రత్యేకంగా లక్ష ఇళ్లను నిర్మించాలని సీఎం రేవంతర్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎటువంటి వివాదాలు లేకుండా, అందుబాటులోని ధరల్లో వివిధ వర్గాల ప్రజల సొంత ఇంటి కలలను నెరవేర్చడంలో హౌసింగ్ బోర్డుకు మంచి పేరు ఉంది. అంతే కాకుండా బోర్డు ఆధ్వర్యంలో చేపట్టి ప్రాజెక్టులకు ప్రజల నుంచి ఆదరణతో పాటు డిమాండ్ కూడా ఉన్నదని ఆయన గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో సుదీర్ఘం కాలం తరువాత చేపడుతున్న ప్రాజెక్టులో ప్రజలను కూడా భాగస్వామ్యులను చేయాలన్న ఆలోచనతో, ప్రజల నుంచి అందే సూచనలతోనే ఈ పథకానికి పేరును కూడా ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 28 వరకు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోటీని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు సూచించిన పేర్లలో ఉత్తమమైనదిగా ఎంపికైన దానికి లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తామన్నారు. హౌసింగ్ డిపార్ట్ మెంట్ కు చెందిన tghd.official పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ https://instagram.com/p/DZ6mCF_E1PY/ ద్వారా పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు.
క్యూర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్ఐజి ప్లాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని, ఇందుకు అవసరమైన భూములను ఇప్పటికే గుర్తించామని వివరించారు. ఇందుకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయిస్తామని, పూర్తి విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 28 లోపల మీ పేరును సూచించవచ్చు.
లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు సూచించండి
లక్ష రూపాయల బహుమతి అందుకోండి
క్యూర్ ఏరియాలో లక్ష ఫ్లాట్ల నిర్మాణం
ఎల్ ఐ జి హౌసింగ్ స్కీం – పేరు ఖరారుపై పోటీ
ఈ నెల 28 వరకు సోషల్ మీడియాలో నిర్వహణ
ఉత్తమమైనదిగా ఎంపికైన దానికి రూ.లక్ష బహుమతి
హౌసింగ్ బోర్డు వినూత్న ప్రయత్నంతెలంగాణ… pic.twitter.com/gLUX20S0Y5
— IPRDepartment (@IPRTelangana) June 23, 2026