
ముషీరాబాద్, వెలుగు: విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్మాణ్ సంస్థ, డాక్టర్‌బీఆర్.అంబేద్కర్ డిగ్రీ, పీజీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో కాలేజీలో సోమవారం ఏర్పాటు చేసిన నిర్మాణ్ కేరీర్అండ్ప్లేస్మెంట్ సెల్ ను కరస్పాండెంట్ సరోజా వివేక్ ప్రారంభించారు.
నిర్మాణ్ సంస్థ ప్లేస్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ, ప్లేస్‌మెంట్ ఎంతో అవసరమని పేర్కొన్నారు.
డాక్టర్లింబాద్రి మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ సెల్ ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. నిర్మాణ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సీఎక్స్ వో హరీశ్మాట్లాడుతూ.. ప్లేస్‌మెంట్ సెల్ ప్రారంభానికి సహకరించిన కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, కెరీర్ గైడెన్స్, ఉపాధి అవకాశాల కల్పనకు తమ సంస్థ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.