Reading Time: 2 minutes

ఓ మై గాడ్.. బేస్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగానే భూకంపం.. భయంతో పరుగులు ప్లేయర్స్, ఫ్యాన్స్!

Caption of Image.

Venezuela Earthquake: క్రీడా మైదానంలో ఆటగాళ్లు, అభిమానులు ఫుల్ జోష్‌లో ఉండగా ప్రకృతి ఒక్కసారిగా ప్రకోపించింది. వెనిజులాలో జరిగిన ఒక ప్రొఫెషనల్ బేస్‌బాల్ మ్యాచ్‌ భూకంపం కారణంగా అకస్మాత్తుగా నిలిచిపోయింది. భూమి భయంకరంగా కంపించడంతో ప్లేయర్స్, అంపైర్లు, వేలాది మంది అభిమానులు ప్రాణాలు కాపాడుకోవడానికి గ్రౌండ్ బయటకి పరుగులు తీసిన దృశ్యాలు లైవ్ వీడియో కెమెరాల్లో రికార్డయ్యాయి.

మ్యాచ్‌ జరుగుతుండగానే భూకంపం: 
నిన్న (బుధవారం) కారకాస్‌లోని ప్రసిద్ధ ఎస్టాడియో యూనివర్సిటారియో (Estadio Universitario) స్టేడియంలో మెరినెరోస్ (Marineros), సెనడోర్స్ (Senadores) జట్ల మధ్య హోరాహోరీగా బేస్‌బాల్ మ్యాచ్ కొనసాగింది. ఆట జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భూమి దద్దరిల్లింది. మొదట ఏం జరుగుతుందో తెలియక ప్లేయర్స్, ప్రేక్షకులు అయోమయానికి గురైనప్పటికీ.. సెకన్ల వ్యవధిలోనే భూకంప తీవ్రత విపరీతంగా పెరిగిపోవడంతో స్టేడియం అంతటా తీవ్ర భయాందోళనలు (Panic) నెలకొన్నాయి.

బయటకి పరుగులు తీసిన ప్లేయర్లు: 
స్టేడియం స్ట్రక్చర్లు కూలిపోతాయేమోననే భయంతో.. మైదానంలో ఉన్న ఆటగాళ్లంతా ప్రాణాలు అర చేతిలో పట్టుకుని ఓపెన్ ఏరియా అయిన గ్రౌండ్ మధ్యలోకి (Centre of the field) పరుగు తీశారు. మరోవైపు, స్టాండ్స్‌లో కూర్చున్న వేలాది మంది అభిమానులను గ్యాలరీల నుంచి కిందికి దిగి, స్టేడియం బయట ఉన్న సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లేందుకు అధికారులు తక్షణమే అనుమతించారు. స్టేడియంలోని భారీ లైట్ పోల్స్ (Light poles), పెద్ద పెద్ద కట్టడాలు ఊయల ఊగినట్లు ఊగిపోవడం అక్కడి కెమెరాల్లో రికార్డయ్యింది.

కారకాస్ నగరంలో భారీ నష్టం: 
వెనిజులాను అతలాకుతలం చేసిన వరుస భూకంపలలో భాగంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ భూకంపం కారణంగా రాజధాని కారకాస్‌తో పాటు పలు ఇతర నగరాల్లోని వందలాది భవనాలు, నిర్మాణాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రభుత్వ అధికారులు ధృవీకరించారు. ఈ భూకంపం అనంతరం కూడా మళ్లీ ఆఫ్టర్ షాక్స్ (Aftershocks) వచ్చే ప్రమాదం ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్స్ దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది.  

©️ VIL Media Pvt Ltd.