మెంతి టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు : మెంతి కూర ఒక కట్ట, టమాటాలు నాలుగు, పచ్చి మిర్చీ నాలుగు, నిమ్మకాయ సైజు చింత పండు, వెల్లుల్లి రె బ్బలు, అర కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు, నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు.
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మెంతి, టమాటాలను నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని ఫ్యాన్ కింద నీరు మొత్తం పోయే వరకు ఆరబెట్టాలి. అవి పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో నూనె వేసి పచ్చి మిర్చీ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత అందులోనే టమాటాలు, చింత పండు, ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పచ్చి మిర్చి, మెంతి కూర అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. వీలైతే కొంచెం కొత్తిమీర, రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి. ఇది మొత్తం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార బెట్టుకోవాలి.
చల్లారిన తర్వాత దానిని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అందులో చిన్న అల్లం ముక్క , వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దానిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు ఈ చట్నీని పోపు పెట్టుకోవాలి.
ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేయాలి. పాన్ పెట్టి అందులో, చిటికెడు పసుపు, జీలకర్ర, ఆవాలు, ఎండు మర్చి, వెల్లుల్లిరెబ్బలు, కరివేపాకు అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత, దానిని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో వేయాలి. అంతే టేస్టే టేస్టీ మెంతి టమాటా పచ్చడి రెడీ, ఇలా చేసి ఒక్క ముద్ద తిన్నా సరే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.




