
అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా. రాష్ట్రంలోని, దేశంలోని క్రీడాకారులకు, క్రీడాభిమానులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషెస్ చెప్పారు. ఈ దినోత్సవాన్ని ఒక గొప్ప స్ఫూర్తిగా తీసుకుని… ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల మధ్య ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వ భావాలను మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడంతో పాటు… లింగ, వయసు, సామర్థ్యాల పరంగా ఎలాంటి వివక్ష లేని సమాన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణలకు నిలువెత్తు రూపాలైన క్రీడాకారులు… తమ లక్ష్యాల సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగాలని సూచించారు.
►ALSO READ | DR కాంగోపై పూర్ ఫెర్ఫామెన్స్.. పోర్చుగల్ తుది జట్టు నుంచి రొనాల్డ్ ఔట్..?
అలుపెరగని ప్రయత్నమే నిజమైన విజయానికి నాంది అని గుర్తు చేస్తూ… క్రీడారంగంలో ఎదురయ్యే ప్రతి సవాలును ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అధిగమించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం అందరిలోనూ సరికొత్త ప్రేరణ నింపాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.