Reading Time: < 1 minute
Ravi Teja Irumudi Movie Box Office Career Test Shiva Nirvana

ఒకప్పుడు రవితేజ సినిమా వస్తోందంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఉండేది. కానీ ‘ధమాకా’ సక్సెస్ తర్వాత వచ్చిన ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర సినిమాలు భారీ అంచనాలతో వచ్చి రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ వల్ల తీవ్రంగా నిరాశపరిచాయి. కెరీర్ లో తొలిసారి తన ఇమేజ్ ను పక్కన పెట్టి, ‘మాస్ మహారాజ’ ట్యాగ్ ను కూడా తీసేసి చేసిన ‘భరత మహాశయులకు విజ్ఞప్తి’ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ప్రస్తుతం రవితేజ మార్కెట్ డీలా పడిన తరుణంలో ఆయన ఆశలన్నీ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ‘ఇరుముడి’ సినిమా పైనే ఉన్నాయి.

ఫాదర్-డాటర్ సెంటిమెంట్, డివోషనల్ టచ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో వస్తున్న ఈ జోనర్ రవితేజకు పూర్తిగా కొత్తది. ఫాదర్స్ డే పోస్టర్, గ్లిమ్స్ కు మంచి స్పందన వచ్చినా.. సోషల్ మీడియా హైప్ ఒక్కటే సరిపోదు, థియేటర్ కి జనాలు రావాలంటే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఆగస్టు 21న విడుదల కానున్న ‘ఇరుముడి’ రవితేజ కెరీర్ లో ఒక కీలక పరీక్ష కానుంది. మరోవైపు రవితేజ వరుసగా హసిత్ గోలి-దిల్ రాజు కాంబో, వివేక్ ఆత్రేయ, హరి, మారుతి లతో కొత్త ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్నప్పటికీ.. ప్రస్తుతం ఆయనకు కావాల్సింది కొత్త అనౌన్స్మెంట్లు కాదు, మార్కెట్ ను నిలబెట్టే ఒకే ఒక్క సాలిడ్ బాక్స్ ఆఫీస్ హిట్!