Reading Time: < 1 minute
బ్లాక్‌ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం

ప్రకృతి అంటేనే అంతుచిక్కని మిస్టరీ. ఎన్నో వింతలు, విశేషాలకు ఆలవాలం. ఇక జంతు ప్రపంచంలో ఎన్నో మిస్టరీలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. బ్లాక్ మిల్క్. అదేనండీ నల్ల రంగు పాల గురించి మీరెప్పుడైనా విన్నారా. పాలు అంటే తెల్లగా ఉంటాయి. గేదె, ఆవు ఇతర జంతువుల పాలన్నీ తెల్లగానే ఉంటాయి. కానీ ఒక జంతువు పాలు మాత్రం నల్లగా ఉంటాయని సోషల్ మీడియాలో తరుచూ చర్చ నడుస్తోంది. ఆఫ్రికాకు చెందిన బ్లాక్ రైనో పాలల్లో విచిత్రమైన గుణం ఏంటంటే.. అందులో ఫ్యాట్ శాతం దాదాపు శూన్యం. కేవలం 0.2శాతం కొవ్వు పదార్థాలు మాత్రమే ఈ పాలల్లో ఉంటాయి. కొవ్వు శాతం ఇంత తక్కువగా ఉండటం వల్లే ఆ పాలు చిక్కదనాన్ని కోల్పోయి, దాదాపు నీళ్లలా కాస్త నల్లగా కనిపిస్తాయి. ప్రకృతిలో లభించే క్షీరదాల పాలల్లోకెల్లా అత్యంత అరుదైన, వింతైన పాలగా దీనిని గుర్తిస్తారు. నిజానికి బ్లాక్ రైనో పాలు నల్లటి రంగులో ఉండవు. జంతువు పేరులో బ్లాక్ ఉండటం, చూడటానికి పాలు వేరుగా ఉండటం వల్ల ఈ అపోహ ప్రచారంలోకి వచ్చింది. నిజానికి ఈ ఖడ్గమృగం ఇచ్చే పాలు చాలా పల్చగా, ఒక వింతైన రంగులో కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం రోజూ చూసే ఆవు, గేదె పాలలా అవి చిక్కగా, తెల్లగా ఉండవు. అన్ని జంతువుల పాలు ఒకేలా, చిక్కగా, తెల్లగా ఉండవు అనడానికి బ్లాక్ రైనో పాలే ఉదాహరణ. జీవుల అవసరాలకు అనుగుణంగా ప్రకృతి వాటికి భిన్నమైన పోషక విలువలను ప్రసాదించింది. జంతు ప్రపంచంలో దాగున్న ఆశ్చర్యకర వైవిధ్యానికి ఈ బ్లాక్ రైనో పాల రహస్యం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఇది!

ఇంట్లో కూలర్‌ ఆన్‌ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

దంచికొడుతున్న ఎండలు.. అయినా జనాల్లో డి విటమిన్‌ లోపం.. కారణమేంటి?