
Bathroom Tiles Cleaning Tips: బాత్రూమ్ టైల్స్‌పై నీటి మరకలు, ఉప్పునీటితో ఏర్పడే పొరలు, సబ్బు జిడ్డు పేరుకుపోవడం చాలా సాధారణం… కాలక్రమేణా ఈ మరకలు గట్టిపడి టైల్స్ అందాన్ని తగ్గిస్తాయి. సాధారణ క్లీనర్లతో కూడా ఇవి తొలగించడం కష్టంగా మారుతుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్ లు వచ్చినప్పుడు.. ఇంట్లో వారికి ఇది చాలా ఇబ్బందికి అనిపిస్తోంది.. అయితే ఖరీదైన క్లీనింగ్ ఉత్పత్తులు కొనాల్సిన అవసరం లేకుండానే కేవలం రూ.10 విలువైన బేకింగ్ సోడాతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. బేకింగ్ సోడా సహజసిద్ధమైన క్లీనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది టైల్స్ ఉపరితలాన్ని దెబ్బతీయకుండా మొండి మరకలను సులభంగా తొలగిస్తుంది. అంతేకాకుండా టైల్స్‌పై గీతలు పడకుండా శుభ్రం చేయడంలో సహాయపడుతుంది.
టైల్స్‌పై మొండి మరకలు ఎలా తొలగించాలి..?
టైల్స్ శుభ్రం చేయడానికి ముందుగా అర కప్పు బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి చిక్కటి పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను టైల్స్‌పై, అలాగే టైల్స్ మధ్య ఉన్న గ్రౌట్‌పై సమానంగా రాయాలి. మరకలు ఎక్కువగా ఉంటే పేస్ట్‌పై కొద్దిగా తెల్ల వెనిగర్ చల్లాలి. దీంతో రసాయన చర్య జరిగి నురుగు ఏర్పడి లోతైన మురికిని బయటకు తీస్తుంది. ఈ మిశ్రమాన్ని 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత స్పాంజ్ లేదా పాత టూత్ బ్రష్‌తో సున్నితంగా రుద్దాలి. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగి మైక్రోఫైబర్ గుడ్డతో తుడవాలి. ఇలా చేస్తే బాత్రూమ్ టైల్స్ కొత్తవాటిలా మెరిసిపోతాయి.
బేకింగ్ సోడా ఎందుకు ప్రభావవంతంగా ఉంటుంది?
ఇంటిని శుభ్రపరచడానికి బేకింగ్ సోడా ఒక అద్భుతమైన మరియు చవకైన ఎంపికగా నిరూపించబడింది. అంతర్జాతీయ నిపుణుల వెబ్‌సైట్ హెలమైడ్ ప్రకారం, బేకింగ్ సోడా ఒక తేలికపాటి రాపిడి పదార్థంలా పనిచేస్తుంది. ఇది టైల్స్ యొక్క మెరుపును లేదా ఉపరితలాన్ని పాడుచేయకుండా, మొండి మురికిని మరియు మరకలను సులభంగా వదులు చేస్తుంది. దీని వాడకం గీతలను కూడా నివారిస్తుంది.