Reading Time: 2 minutes

Avatar 3 OTT Release : ఓటీటీలోకి వచ్చేసిన ‘అవతార్ 3’.. మధ్యాహ్నం నుంచే డిజిటల్ స్క్రీన్‌పైకి!

Caption of Image.

గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar: Fire and Ash) . ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 12వేల కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో సంచనాలు సృష్టించిన ఈ మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్ పై రచ్చ చేయడానికి వచ్చేసింది. 

జియోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

సినీ ప్రియులను అలరించేందుకు ఈ విజువల్ వండర్ ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల నుండి జియోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సాధారణంగా భారీ చిత్రాలు అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి వస్తాయని అందరూ భావిస్తారు, కానీ ఈసారి భిన్నంగా మధ్యాహ్నం నుంచే అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఏంటంటే?

‘అవతార్’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో భాగం ఇది. మొదటి భాగంలో అడవులు, రెండో భాగంలో సముద్ర గర్భాన్ని చూపించిన కామెరాన్.. ఈ ‘ఫైర్ అండ్ యాష్’లో ‘యాష్ పీపుల్’ (బూడిద తెగ) అనే సరికొత్త నావి క్లాన్‌ను పరిచయం చేశారు. నిప్పుతో చెలగాటమాడే క్రూరమైన స్వభావం గల ఈ తెగకు ‘వరాంగ్’ నాయకత్వం వహిస్తుంది. సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగౌర్నీ వీవర్, కేట్ విన్స్‌లెట్‌ల పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పండోరా గ్రహంలోని మరో చీకటి కోణాన్ని ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారు.

బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట.

థియేటర్లలో రిలీజైన ఈ విజువల్ స్పెక్టకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.12,000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఇండియన్ సినీ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం జోరు చూపిస్తూ రూ.200 కోట్ల క్లబ్‌ లో చేరింది. అంతేకాదు, సాంకేతికంగా సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసినందుకు గానూ ఈ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్’ కేటగిరీని కైవసం చేసుకుంది. ఇక ఈ రోజే జియోహాట్‌స్టార్ లో ఈ ‘అవతార్ 3’ చూసి ఆ విజువల్ మాయాజాలాన్ని ఎంజాయ్ చేయండి.

 

©️ VIL Media Pvt Ltd.