
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా, ఇండియన్ ఫిన్‌టెక్ స్టార్టప్ క్రెడ్ మధ్య భారీ డీల్ కుదిరింది. CRED లో మెటా సుమారు 900 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 8 వేల 550 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఈ డీల్ కు సంబంధించిన వివరాలను రెండు కంపెనీలు 2026 జూన్ 22న (సోమవారం) ప్రకటించాయి. ఇందులో భాగంగా క్రెడ్ ఫౌండర్ కునాల్ షా వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
జూన్ ప్రారంభంలో, 4 బిలియన్ డాలర్లు క్రెడ్‌లో పెట్టుబడి పెట్టడానికి లేదా వాటా కొనుగోలుకు మెటా చర్చలు జరిపింది. ఈ డీల్ ప్రకారం.. కునాల్ షా వాట్సాప్ కు గ్లోబల్ సీఈఓగా మెటాలో చేరనున్నారు. కునాల్ క్రెడ్‌ను ఇండియాలో ప్రముఖ టెక్నాలజీ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దారు. ఇక నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్‌ను నడపడంలో ఆయన అనుభవం తోడవుతుందని మెటా పేర్కొంది.
►ALSO READ | నెలకు జీతం రూ.3లక్షల 50వేలు.. డబ్బులు అస్సలు మిగలట్లే.. సలహాలు కోరిన బెంగళూరు టెక్కీ
ఇప్పటి వరకు వాట్సాప్ కు ఏడేళ్లుగా నాయకత్వం వహించిన విల్ క్యాత్‌కార్ట్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. విల్, మెటా కు అత్యంత ముఖ్యమైన, సమర్థవంతమైన నాయకులలో ఒకరు. వాట్సాప్‌ను 3 బిలియన్లకు పైగా ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారు. విల్ మెటాలోనే ఒక కొత్త పాత్రలోకి మారబోతున్నారు. మేమిద్దరం కలిసి మెటాను, వాట్సాప్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా కునాల్ షా పేర్కొన్నారు.