
సిల్వర్ స్క్రీన్ పై రౌడీలను రఫ్ఫాడించే దళపతి ఇప్పుడు రియల్ లైఫ్ పొలిటికల్ గ్రౌండ్‌లో ప్రత్యర్థులకు సినిమా చూపిస్తున్నారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన విజయ్ తనదైన పంథాలో పాలన సాగిస్తున్నారు. అసెంబ్లీలో తన ఊరమాస్ స్పీచ్ తో ప్రతిపక్ష నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. లేటెస్ట్ అసెంబ్లీలో వేసిన డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
దళపతి మార్క్ పొలిటికల్ యాక్షన్…
సినిమా షూటింగ్ సెట్ నుంచి నేరుగా వచ్చి సీఎం కుర్చీలో కూర్చున్నాడు అంటూ విపక్షాలు చేస్తున్న కామెంట్స్‌పై విజయ్ తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. కొందరు నేను నేరుగా సినిమా సెట్ నుండి వచ్చి ముఖ్యమంత్రి అయ్యానంటున్నారు. వాళ్ల భాషలోనే చెప్పాలంటే అదొక పెద్ద అబద్ధం. మేము కేవలం ఫ్యాన్ క్లబ్‌గా ఉన్నప్పటి నుంచే ప్రజల పక్షాన నిలబడ్డాం. 2008 నుంచే సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నామని చెప్పారు. 2024లో పార్టీ పెట్టి, 2026 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడం వెనుక దశాబ్దాల కష్టం ఉందంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ మాస్ డైలాగ్స్‌కు అసెంబ్లీ హాల్ చప్పట్లతో మారుమోగిపోయింది.
►ALSO READ | మళ్లీ తాతయ్యగా సీఎం చంద్రబాబుకు ప్రమోషన్.. నారా వంశంలోకి మరో వారసుడి ఎంట్రీ!
అల్లు అర్జున్ స్ట్రైల్ లో క్లైమాక్స్ సీన్..
విజయ్ స్పీచ్ తట్టుకోలేక డీఎంకే (DMK) ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ పడింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ ఐకానిక్ హ్యాండ్ గెస్టర్ ను విజయ్ అసెంబ్లీలో రీ-క్రియేట్ చేయడానికి స్పీకర్ పర్మిషన్ అడగడం.. ఆ సైగను చూపించడం హాట్ టాపిక్ అయ్యింది. పుష్పలో అల్లు అర్జున్ స్టైల్లో గడ్డం కింద చేయి పెట్టి అంతా అయిపోయిందన్న తరహాలో డైలాగ్ చెబుతూ ఓ సైగ చేశారు. దీంతో అధికార పక్ష సభ్యులు హర్షద్వానాలు చేయగా.. డీఎంకే సభ్యులు ఆగ్రహంతో సభనుంచి వాకౌట్ చేశారు.
Ketta paiyan sir Intha Vijay 😎 pic.twitter.com/aLH9uR1fav
— Actor Vijay Fans (@Actor_Vijay) June 23, 2026
సినిమా థియేటర్లలో విజయ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్తే ఎలా ఉంటుందో.. అసెంబ్లీలో ఈ సీన్ చూస్తుంటే అలాగే అనిపించిందంటూ నెటిజన్లు వీడియోను ట్రెండ్ చేస్తున్నారు. సినిమా గ్లామర్‌తో కాదు, క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్న కనెక్షన్‌తోనే తను రియల్ సీఎం అయ్యానని నిరూపించారంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి, తమిళనాడు పాలిటిక్స్‌లో ఇప్పుడు విజయ్ వన్-మ్యాన్ షో నడుస్తోంది.
“Best speaker. Best politician.
CM Vijay – no doubts.” 🔥 pic.twitter.com/vDhMyOyrQY
— Pokkiri_Victor (@Pokkiri_Victor) June 23, 2026