Reading Time: 2 minutes
Skoda Unveils New 7 Seater Electric Suv Peak With Up To 647 Km Range And Premium Features

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ స్కోడా తన కొత్త ఫ్లాగ్‌షిప్ 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV ‘స్కోడా పీక్’ను ఆవిష్కరించింది. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో ఇది అతిపెద్ద SUVగా నిలవనుంది. హ్యుందాయ్ ఐయోనిక్ 9, కియా EV9, వోల్వో EX90 వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ SUVలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. భవిష్యత్తులో భారత మార్కెట్‌లోనూ ఈ మోడల్‌ను ప్రవేశపెట్టే అవకాశాలను కంపెనీ పరిశీలిస్తోంది.

ఆకట్టుకునే డిజైన్

స్కోడా పీక్‌లో కంపెనీ తాజా మోడర్న్ డిజైన్ ఫిలాసఫీని ఉపయోగించింది. ముందు భాగంలో T-ఆకారపు LED మ్యాట్రిక్స్ హెడ్‌లైట్లు, ఐబ్రో స్టైల్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మూసివేసిన గ్రిల్, గ్లాస్-బ్లాక్ ఫినిషింగ్, స్కూప్-స్టైల్ బోనెట్, బంపర్‌లో ఎయిర్ వెంట్స్ SUVకు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.

సైడ్, రియర్ ప్రొఫైల్

సైడ్ ప్రొఫైల్‌లో 19 లేదా 21 అంగుళాల ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, LED టర్న్ ఇండికేటర్లతో కూడిన ORVMలు ఉన్నాయి. వెనుక భాగంలో పెద్ద స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, T-ఆకారపు LED టెయిల్ లైట్లు, రిఫ్లెక్టర్లతో కూడిన బంపర్ వాహనానికి స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి.

లగ్జరీ ఫీచర్లు

స్కోడా పీక్‌లో 13.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, 10 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

అదనంగా ఇందులో డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్, అన్ని వరుసలలో USB ఛార్జింగ్ పోర్టులు, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ కీ సపోర్ట్, స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్ ద్వారా అన్‌లాక్ సదుపాయం, 16-స్పీకర్ల సోనోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

బ్యాటరీ, రేంజ్ వివరాలు

స్కోడా పీక్‌ను 60, 90, 90X అనే మూడు వేరియంట్లలో అందించనున్నారు. ఈ SUV వోక్స్‌వ్యాగన్ MEB ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు. బ్యాటరీ ఆప్షన్స్.. 63kWh బ్యాటరీ ప్యాక్, 91kWh బ్యాటరీ ప్యాక్. 63kWh బ్యాటరీతో గరిష్టంగా 459 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుండగా, 91kWh బ్యాటరీతో ఒకే ఛార్జ్‌పై గరిష్టంగా 647 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

వేరియంట్లు, పనితీరు

Peak 60

204 hp శక్తి
సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్
0-100 km/h వేగం: 8.6 సెకన్లు

Peak 90

286 hp శక్తి
91kWh బ్యాటరీ
0-100 km/h వేగం: 7.1 సెకన్లు

Peak 90X (టాప్ వేరియంట్)

డ్యూయల్ మోటార్ AWD వ్యవస్థ
299 hp శక్తి
గరిష్ట రేంజ్: 613 కిలోమీటర్లు
0-100 km/h వేగం: కేవలం 6.7 సెకన్లు
భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం