Reading Time: < 1 minute
Salman Khan: కోర్ట్ మెట్లెక్కిన సల్మాన్.. ఆ గ్యాంగ్ కౌంట్ డౌన్..!

బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ మరోసారి వివాదాల బారిన పడ్డారా..? ఆయనకు తెలియకుండానే ఆయన బయోపిక్ తీసారా..? చాలా కాలంగా కండల వీరుడిని బెదిరిస్తున్న బిష్ణోయ్ గ్యాంగే ఈ సినిమాను బ్యాకప్ చేస్తున్నారా..? కాలా హిరణ్ అనే సినిమాలో అసలు ఏముంది..? దీన్ని రిలీజ్ కాకుండా ఆపడానికి సల్మాన్ లాంటి స్టార్ హీరో కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు..? ఈ టీజర్‌లో ఉన్న హీరోను చూస్తుంటే సల్మాన్ ఖాన్ గుర్తుకొస్తున్నారు కదా..? అందుకే కండల వీరుడు కూడా కన్ఫ్యూజ్ అయి.. ఈ రిలీజ్ ఆపాలని కోర్టు మెట్లెక్కారు. కాలా హిరణ్ సినిమా తన ఇమేజ్ దెబ్బతీసేలా ఉందని లీగల్ వార్ మొదలుపెట్టారు. 1998లో రాజస్థాన్‌లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ టైమ్‌లోని కృష్ణజింకల కేస్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆ కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల శిక్ష కూడా పడింది. వన్యప్రాణులను దేవుడిలా పూజించే అక్కడి ‘బిష్ణోయ్’ వర్గంలోని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చాలా ఏళ్లుగా సల్మాన్‌ను చంపేస్తానని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరగడం కలకలం రేపాయి. ఈ టైమ్‌లోనే అమిత్ జానీ అనే నిర్మాత ‘కాలా హిరణ్: ది బ్యాటిల్ ఫర్ లెగసీ’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో సల్మాన్ లాగే కనిపించే ఒక నటుడిని పెట్టి, చేతికి బ్లూ బ్రాస్‌లెట్ వేసి నెగెటివ్ పాత్రలో చూపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సల్మాన్. మరోవైపు సినిమా తీస్తున్నందుకు సల్మాన్ మనుషులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ముదురుతుంది. మరి ఈ కాంట్రవర్సీ ఇంకా ఎంతదూరం వెళ్తుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఖాళీగా ఓలా.. అయినా ఉబర్‌ కోసం అరగంట వెయిటింగ్‌! బెంగళూరులో వింత ఘటన

11 ఏళ్లకే యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డ్‌.. వైజాగ్ టు లండన్ కలశ నాయుడు ప్రయాణం

ఉద్యోగితో రూ. 2.5 లక్షల ఫిట్‌నెస్ బెట్ లో ఓడిన జెరోదా బాస్

ఫోన్‌ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో..

వీడు మామూలోడు కాదు.. పగలు ఇళ్లకు రంగులు.. రాత్రయితే చాలు..