Reading Time: < 1 minute

గాదె సాయికృష్ణది లాకప్ డెత్ : సిట్ రిమాండ్ రిపోర్టులో సంచలనాలు..

Caption of Image.

ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో విచారణ ముమ్మరం చేశారు సిట్ అధికారులు. ఈ కేసుకు సంబంధించి సస్పెండెడ్ సీఐ నాగరాజును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో సాయికృష్ణ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సిట్. మృతదేహాన్ని కూడా మాయం చేశారని పేర్కొంది సిట్. సాయికృష్ణ మృతదేహాన్ని కృష్ణలంక పీఎస్ లో చూశానని ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.

కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ డీవీఆర్ లో లేకుండా చేశారని… సాయికృష్ణ మృతి చెందాడని తెలిసినప్పటికీ కృష్ణలంక పీఎస్ సిబ్బంది మేజిస్ట్రేట్ కు సమాచారం ఇవ్వలేదని పేర్కొంది సిట్. సాయికృష్ణ తల్లిని నాగరాజు దూషించాడని…సాక్షాలను నాశనం చేయడానికి నాగరాజే కారణమని పేర్కొంది సిట్.

మే 8న సాయికృష్ణను మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ కోర్టులో హాజరు పరచలేదని పేర్కొంది సిట్. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుందని తెలిపింది సిట్.

©️ VIL Media Pvt Ltd.