Reading Time: 2 minutes
Jabardasth Ring Riyaz: ఇండస్ట్రీకి దూరమైన జబర్దస్త్ రింగ్ రియాజ్ ఇప్పుడెక్కడున్నాడు? ఏం చేస్తున్నాడో  తెలుసా?

రింగ్ రియాజ్.. తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్, అదిరింది తదితర కామెడీ షోలతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు రియాజ్. చూడడానికి పొట్టిగా ఉన్నా కామెడీ పంచులు గట్టిగానే వేస్తాడీ యాక్టర్. అన్నట్లు ఇతనికి రింగ్ రియాజ్, గల్లీ బాయ్ రియాజ్ ఇలా చాలా పేర్లు ఉన్నాయి. కేవలం బుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా మెరిశాడు రియాజ్. న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాలో బాగా హైలెట్ అయ్యాడీ జబర్దస్త్ కమెడియన్. అలాగే కొన్ని వెబ్ సిరీసుల్లోనూ కనిపించాడు రియాజ్. సినిమాలు, టీవీ షోల సంగతి పక్కన పెడితే.. తన వ్యక్తిగత జీవితంతోనూ ఇతను వార్తల్లో నిలిచాడు. ముఖ్యంగా రాజకీయాల విషయంలో ఇతను చేసిన కామెంట్స్, ప్రవర్తించిన తీరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. మొదట పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి మద్దతుగా నిలిచిన రియాజ్ నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ ఓడిపోయాడు. అయితే ఆ వెంటనే వైసీపీకి మద్దతుదారుడిగా మారిపోయాడు. ఇక బిజినెస్ లోనూ రాణించాడు రియాజ్. నెల్లూరులో రింగ్ రియాజ్ స్ట్రీట్ ఫుడ్ అండ్ కేప్ అనే పేరుతో రెస్టారెంట్ రన్ చేశాడు.

ఈ విషయాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం బుల్లితెరపై కానీ వెండితెరపై కానీ పెద్దగా కనిపించడం లేదు రియాజ్. ఆ మధ్యన అతను దేశం విడిచి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఒక షూట్ కోసమేనని ఆ తర్వాత తెలిసింది. కాగా ప్రస్తుతం నెల్లూరులోనే ఉంటున్నాడు రియాజ్. నగరంలోనే ‘రింగ్ రియాజ్ ఫ్యాషన్స్ ‘ పేరుతో ఒక దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నాడు. దీంతో పాటు రింగు రియాజ్ వాల్గ్స్ పేరుతో ఒక సొంత యూట్యూబ్ ఛానెల్ ను కూడా నిర్వహిస్తున్నాడు రియాజ్. సినిమా స్ఫూప్ వీడియోలతో పాటు అందులోనే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటున్నాడు. ఈ యూట్యూబ్ ఛానల్ కు భారీ స్థాయిలో సబ్స్క్రైబర్లు కూడా ఉండడం గమనార్హం. ఇలా మొత్తానికి బిజినెస్ చేస్తూనే యూట్యూబ్ తోనూ ఆదాయం ఆర్జిస్తున్నాడు రియాజ్.

‘రింగ్ రియాజ్ ఫ్యాషన్స్’ పేరుతో..

 

View this post on Instagram

 

A post shared by Syed Riyaz (@gullyboyriyaz)

ఇక ఇన్ స్టాగ్రామ్ లోనూ ఇంట్రెస్టింగ్ ఫొటోలు, వీడియోలు చేస్తున్నాడు రియాజ్. నెటిజన్ల నుంచి కూడా వీటికి మంచి స్పందన వస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి