Reading Time: 1 minute

Ram Pothineni: భారీ బడ్జెట్‌తో రామ్ పోతినేని ‘RAPO23’.. బాక్సాఫీస్ షేక్ చేసేలా బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ ప్లాన్!

Caption of Image.

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈసారి బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించేలా సరికొత్త ప్లాన్ తో రెడీ అవుతున్నారు. రామ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, ముందెన్నడూ లేని భారీ స్కేల్‌లో ‘RAPO23’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని ఎక్కడా రాజీ పడకుండా, టాలీవుడ్ హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారు.

హాలీవుడ్ రేంజ్ విజువల్స్..

ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రామ్ ఇమేజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా హై-వోల్టేజ్ యాక్షన్, అన్‌కాంప్రమైజ్డ్ ఎమోషన్స్, మైండ్ బ్లోయింగ్ గ్రాండియర్‌తో ఈ కథను సిద్ధం చేశారు. కేవలం బడ్జెట్ మాత్రమే కాదు, ఈ సినిమా కోసం టాప్  టెక్నీషియన్స్ రంగంలోకి దింపారు.  నేషనల్ అవార్డ్ విన్నర్, విజువల్ మ్యాజిషియన్ తిరు ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు చేపట్టారు.

ఇండియన్ స్క్రీన్‌పై యాక్షన్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన పీటర్ హెయిన్ హాలీవుడ్ రేంజ్ ఫైట్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన టీమ్ భారీ యాక్షన్ బ్లాక్స్ కోసం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ డిజైనర్ ఎ.ఎస్. ప్రకాష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లలో ఒక కంప్లీట్ సిటీ సెట్‌తో పాటు, హై-ఫై యాక్షన్ ఎపిసోడ్స్ కోసం భారీ సెట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

మోస్ట్ పవర్‌ఫుల్ రోల్

మాస్ పల్స్ తెలిసిన రామ్..ఈ సినిమాలో ముందెన్నడూ చూడని సరికొత్త గెటప్‌లో, ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారట.  ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వరసు అపజయాలతో నిరాశతో ఉన్న రామ్ ఈసారి గట్టి ప్లాన్ తో ఉన్నారు.  అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రామ్ సరసన నటించబోయే లక్కీ బ్యూటీ ఎవరు? మ్యూజిక్ పల్స్ పెంచే ఆ రాకింగ్ డైరెక్టర్ ఎవరు? అనే విషయాలను మేకర్స్ చాలా సీక్రెట్‌గా ఉంచారు. త్వరలోనే ఈ క్రేజీ అప్‌డేట్స్‌తో పాటు రెగ్యులర్ షూటింగ్ డేట్స్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.