
అవార్డులపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పెద్ది’ సినిమాలో చరణ్‌ది నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ అంటున్నారని తెలిపారు. అవార్డులు రావడానికి చాలా మార్గాలు ఉన్నాయన్నారు. అవార్డు వచ్చినా రాకపోయినా అది పెద్ద సమస్య కాదన్నారు. రంగస్థలానికి కూడా అవార్డు రావాలని తనతో సుకుమార్ ఎన్నో సార్లు అన్నారని గుర్తు చేశారు. ప్రజల మనసులో మాత్రం చరణ్ స్థానం సంపాదించుకున్నారంటూ ప్రశంసించారు చిరంజీవి.
“స్టార్ కొడుకు, గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు, చరణ్‌కి అవసరం లేదు, డైరెక్టర్ ఏం చెప్పాడో అది మెకానికల్‌గా చేసి వెళ్ళిపోతే ఇదే సినిమా, ఇదే హిట్ అవుతుందేమో, ఇంతే అవుతుందేమో తెలియదు. కానీ దాని మించి అయింది, బియాండ్ 100% అయింది. అంటే గనుక చరణ్ వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ షో అంటున్నాడు అన్న. ‘నేషనల్ అవార్డ్ వస్తుంది, నేషనల్ అవార్డ్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్’ అంటున్నారు. అంటే అవార్డు రానివ్వండి, రాకపోనివ్వండి, అది పెద్ద సమస్య కాదు.
ఈ రోజున రంగస్థలానికి కూడా రావాలని నాతోటి సుకుమార్ గారు ఎన్నో సార్లు అన్నారు, ఇది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని, అంత బాగా చేశాడు మన చరణ్ అంటూ. అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు, అవార్డు రావడానికి ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. బట్, ప్రజల మనసుల్లో ఎంత అద్భుతమైన నటన ఇచ్చాడు అన్నారే.. దాని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ‘అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్’ అంటుంటే గనుక థాంక్యూ సో మచ్” అని పేర్కొన్నారు మెగాస్టార్.