Reading Time: 2 minutes

ఆధ్యాత్మికం: అందమైన జీవితాన్ని ఎంజాయ్ చేయడం ఎలా అంటే..!

Caption of Image.

ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే.. మన లోలోపల ఉండే సంతోషాన్ని ఎప్పుడూ అలాగే మెయింటెయిన్ చేయగలిగితే.. అందమైన జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. ప్రతి దాంట్లో పాజిటివ్ ను చూడగలుగుతాం. ప్రతి ఒక్కరిలో మంచితనాన్ని చూడగలుగుతాం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి మనుషులు ఎదురైనా, ఎవరు ఎలా స్పందించినా కుంగిపోకుండా ఉంటాం. ప్రతిదాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం.

కొత్త కోణాల్లో చూస్తే..

జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు కొత్త కొత్త కోణాల్లో రెస్పాండ్ కావడం నేర్చుకుంటే.. కలిగే దుఃఖం, బాధ వెంటనే ముగిసిపోతాయి. దీనికి కావాల్సిందల్లా దాని మీద అవగాహన! సంతోషంగా ఉన్నప్పుడే సమర్ధవంతంగా పని చేస్తాం. నెగెటివ్ ఆలోచనలు ఎప్పుడూ మనసులో ఒక భారంలా ఉంటాయి. మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీని అవి అవిరి చేస్తాయి. 

నెగెటివ్ ఆలోచనలని పక్కన పెట్టినప్పుడే… ‘క్వాలిటీ లైఫ్’ని అనుభవించగలుగుతాం. పరిస్థితులను కొత్త కోణంలో ఎదుర్కొన్నప్పుడే.. ఆ మూమెంట్స్లో సంతోషాన్ని అనుభవిస్తాం. పాజిటివ్ ఎనర్జీ.. మనసుని పాజిటివ్ స్పందించేలా చేస్తుంది. అదే సంతోషానికి, సంతృప్తికి కారణమవుతుంది. తమను సమస్యలు బంధించినప్పుడు.. మేధావులు ఒక తల్లిలా ఆలోచిస్తారు. ఆ పరిస్థితుల్లో ఒక తల్లి ఏం చేస్తుందో.. అదే చేస్తారు. అలా చేయడం. వల్ల ఆ సమస్యకు వాళ్లకు ఒక కొత్త పరిష్కారం దొరుకుతుంది.

ఇంటర్నల్ గా  స్ట్రాంగ్ ఉంటే…

ఇంటర్నల్ గా ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో…సంతోషం ఉన్నప్పుడే జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఏం జరిగినా..ఎలాంటి పరిస్థితి ఎదురైనా అదొక కొత్త అనుభవాన్ని, కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. అయితే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే.. మనసు సత్యం వైపు, సంతోషం వైపు ఉంటుంది. ఎవరైతే, ఎప్పుడూ సంతోషంగా ఉంటారో వాళ్లు.. తమకు అందుబాటులో ఉన్న వనరులను క్రియేటివ్, ఎఫెక్టివ్గా వాడుకుంటూ ఇతరులను కూడా సంతోషపరుస్తారు. ఇన్స్పైర్ చేస్తారు.

►ALSO READ | ఒత్తిడి ఎక్కువయ్యి.. మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నారా…? ఈ సూపర్ ఫుడ్స్ తింటే చాలు..!

సహజంగానే వాళ్ల మనసు ప్రేమతో నిండి ఉంటుంది. వాళ్లే మనల్ని సరైన దిశలో ప్రయాణించేలా గైడ్ చేస్తారు. నిరంతరం తన ఇన్నర్ కాన్షియస్ మీద ఫోకస్ పెట్టేవాళ్లు.. ఎప్పుడూ పాజిటివ్ , నిర్మలంగా ఉంటారు. కాబట్టి, వీళ్లు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడతారు. రాజ యోగ ధ్యానాన్ని సాధన: చేసేవాళ్లలో… ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది. ఈ ధ్యానాన్ని సాధన చేయడం వల్ల మనసు, మేధస్సు రెండూ కమ్యూనికేట్ అవుతాయి. ఇలా కమ్యూనికేట్ అయినప్పుడు అవి మనిషిని సరైన దిశలో ప్రయాణించేలా గైడ్ చేస్తుంటాయి. ఇదే వాళ్లు గొప్పవాళ్లుగా మారడానికి కారణమవుతుంది.

పాజిటివ్ గా ఉంటే..

మనం ఎంత పాజిటివ్ ఉంటే…మనలో అంత ట్రాన్స్ పరెన్సీ తాలూకు నేచర్ పెరిగిపోతుంది. అప్పుడు చాలామంది మనకు దగ్గరవుతారు. స్నేహితులుగా మారతారు. మనతో కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ప్రేమ, మానవత్వం, సంతోషం లాంటి క్వాలిటీస్ ని పెంపొందించుకుంటే… మనం అందరికీ పారదర్శకంగా కనపడతాం. 

అప్పుడు ఇతరుల కంటికి మనం ఒక ‘మెరిసే అద్దం లాగ కనపడతాం. ఆ అద్దంలో ఎదుటివాళ్లు తమని తాము చూసుకున్నప్పుడు.. వాళ్లు చేసిన పొరపాట్లు ఏంటో రియలైజ్ అవుతారు. ఈజీగా మనల్ని చూసి స్ఫూర్తి పొందుతారు. ఫైనల్గా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిత్యం ధర్మాన్ని, మంచి కర్మలని ఆచరించడమే… ఆరోగ్యానికి, నిజమైన సంతోషానికి మూలాలని గుర్తుంచుకోవాలి.

మెడిటేషన్..

ప్రేమతో నిండిన మనసుని సరైన దిశలో సాగేలా గైడ్ చేసే ధ్యానాన్ని ఒక్కసారి నేర్చుకుంటే… మనకు కష్టాలనేవే ఉండవు. కరెక్ట్ గా ఆలోచిస్తాం. కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటాం. మనం సహజంగా ఉండేందుకు, మనల్ని మన కంట్రోల్లో ఉంచేందుకు ధ్యానం సాయపడుతుంది. ధ్యానం చేస్తే.. బలవంతంగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోనవసరం లేదు. బలవంతంగా ఒక దారిలో ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. 

నెగెటివ్ భావాలు.. మనలో ఉండే మంచి ప్రవర్తనను, మంచి క్వాలిటీస్ ని బయటకు రానివ్వకుండా అడ్డుపడతాయి. ఒకటి లేదా రెండు బలహీనతలు.. మన అసలు సిసలు నేచర్ని పాడు చేస్తాయి. అప్పుడు మనలో ఉండే మంచి క్వాలిటీస్ కూడా ఇతరులకు చెడుగానే అర్ధమవుతుంటాయి. కొన్నిసార్లు ఇతరుల కంటే మనం వినయంగా ఉంటాం. కొన్ని పరిస్థితుల్లో ఇతరులకంటే.. మృదువుగా స్పందిస్తాం. దీని అర్థం ఏంటి? మనలో ఆ క్వాలిటీస్ ఉన్నాయనే కదా? కానీ, అవి పారదర్శకంగా బయటకు కనపడడం లేదు.

©️ VIL Media Pvt Ltd.