
రెగ్యులర్‌గా పండ్లు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.. అయితే.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్థాలను ఎంచుకోవడం ఎంతైనా అవసరం.. అలాంటి పండ్లలో నేరేడు పండు ఒకటి.. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని, అనేక అనారోగ్యాలను నివారించడంలో తోడ్పడుతుంది. నేరేడు కేవలం శక్తిని అందించి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, కొన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తిని కలిగి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పండే కాదు, దాని ఆకులు, బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది నిజంగా ఆరోగ్య ఫలప్రదాయిని అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నేరేడు పండ్ల సీజన్ నడుస్తోంది..
నేరేడు పండు తినడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణక్రియ మెరుగుదల: చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపడానికి నేరేడు పండ్లను తినడం మంచిది. పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పండ్లకు ఉందని ప్రచారంలో ఉంది.
శరీరానికి చలవ: నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి, వేడి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.
రోగనిరోధక శక్తి పెంపు: దీర్ఘకాల వ్యాధుల నుంచి నేరేడు పండ్లను తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.
మూత్ర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం: మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్ళల్లో కలిపి తీసుకోవడం సూచించబడింది.
తక్షణ శక్తి: నీరసం, నిస్సత్తువ ఉన్నవారు నేరేడు పండును తింటే తక్షణ శక్తి వస్తుంది.
నొప్పి నివారణ: వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ళ నొప్పులు నయం కావడంలో ఇది సహాయపడుతుంది.
కాలేయ ఆరోగ్యం: కాలేయం పనితీరును క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్య ఔషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.
మెదడు, గుండె ఆరోగ్యం: ఈ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.
జ్వరం తగ్గించడానికి: జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది.
మధుమేహం, బరువు నియంత్రణ: పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కనుక నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు, మధుమేహం రోగులు సైతం రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడగలదు.
మొత్తం ఆరోగ్యం: నేరేడు పండును రోజుకి ఒకటి చొప్పున తీసుకుంటే మన ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది.
ఎవరు తీసుకోకూడదు?
నేరేడు పండ్లను గర్భిణులు ఎటువంటి పరిస్థితుల్లో తినకూడదు.
నేరేడు అరవడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి. భోజనమైన గంట తర్వాత ఈ పండు తీసుకుంటే ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే మలబద్ధకం సమస్యతో పాటు నోట్లో వెగటుగా ఉంటుంది కాబట్టి మితంగా తీసుకోవడం ముఖ్యం..
నేరేడు పండు దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ.. ఏమైనా సమస్యలుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
నేరేడు పండ్లు విరగకాయడం దేనికి సంకేతం.. నిజంగానే కరువు వస్తుందా..?
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..