Reading Time: 2 minutes
Peddi OTT: ఓటీటీలోకి రామ్ చరణ్ ‘పెద్ది’! కొత్త సీన్లతో కలిపి ఆరోజు నుంచే స్ట్రీమింగ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 04న విడుదలైన పెద్ది సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సుమారు రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్లతో ఆడుతోంది. అలాగే ఈ మధ్యన కొత్త సీన్లు కూడా జత చేశారు. ఇక సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మంగళవారం ( జూన్ 23)న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించన్నట్లు సమాచారం. అభిమానుల సమక్షంలో నిర్వహించనున్న ఈ వేడుకకు రామ్ చరణ్ తో పాటు పెద్ది చిత్ర బృందం మొత్తం హాజరుకానుంది. ఇదిలా ఉంటే థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన పెద్ది సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పెద్ది సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం నిర్మాతలకు రూ. 105 కోట్లు చెల్లించింది. ఈ నేపథ్యంలో జులై 02 నుంచి పెద్ది సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. అతి త్వరలోనే పెద్ది సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై ఒక అధికారిక ప్రకటన రానుంది. మొదట జులై నెలాఖరున ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలనుకున్నారు. అయితే కొన్ని కారణాలతో అనుకున్న డేట్ కంటే ముందే తీసుకు రావాలని అనుకుంటున్నారని టాక్.

వృది సినిమాస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పెద్ది చిత్రాన్ని నిర్మించారు. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, కమెడియన్ సత్య, చమ్మక్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీత అందించారు.

జులై 05 నుంచి స్ట్రీమింగ్ కు ఛాన్స్!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి