Reading Time: < 1 minute

సికింద్రాబాద్ రసూల్ పురలో డ్రగ్స్ కలకలం.. రూ. 1.53 లక్షల ఎండిఎంఏ పట్టివేత..

Caption of Image.

 సికింద్రాబాద్ రసూల్ పురలో డ్రగ్స్ అమ్ముతున్న  వార్త కలకలం రేపింది. ఒక అపార్ట్మెంట్లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు సికింద్రాబాద్ డీటీఎఫ్సీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు.  సోమవారం (జూన్ 22) జరిపిన ఈ తనిఖీల్లో 51 గ్రాముల ఎండిఎంఏ పట్టుబడింది.

 రాజస్థాన్ నుంచి అదే రాష్ట్రానికి చెందిన ఎం ప్రజాపతి, హరేంద్ర బైరోడ్ అనే ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.  గ్రాముకు వెయ్యి రూపాయల చొప్పున కొనుగోలు చేసి.. హైదరాబాదులో గ్రామముకు 3 వేల రూపాయలకు అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడైంది. 

►ALSO READ | ఇసుర్రాయితో కొట్టి..భర్తను చంపింది..  తాగొచ్చి గొడవ పడడంతో దాడి చేసిన భార్య

 పట్టుకున్న ఎండిఎంఐ విలువ లక్ష 53 వేల రూపాయలుగా ఉంటుందని అంచనా వేశారు. తనిఖీల్లో సికింద్రాబాద్ డీటీఎఫ్ టీంలో సీఐ సౌజన్య, ఎస్ఐ శివరామకృష్ణ, కానిస్టేబుల్స్ జనార్దన్, రిజ్వాన్, సిద్ధిక్, అనూషలు ఉన్నారు.  నిందితులను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఐఈ ఎస్ శ్రీనివాసరావు తెలిపారు.

 డ్రగ్స్ అమ్మకాలకు సహకరిస్తున్న వారిపై, కొనుగోలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. డ్రగ్స్ ను ఎవరు వాడకూడదని, డ్రగ్ సమాచారం ఉంటే ఎక్సైజ్ పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

©️ VIL Media Pvt Ltd.