Reading Time: < 1 minute

సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ మూసివేత : AI దెబ్బతో శాంసంగ్ తో సహా ఐటీ షేర్లు కుప్పకూలాయి

Caption of Image.

సౌత్ కొరియా.. దక్షిణి కొరియా స్టాక్ మార్కెట్ మూసివేశారు. ప్రపంచం మొత్తం షాక్ అయ్యారు. దీన్ని అల్లాటప్పాగా తీసుకోవటం లేదు ప్రపంచ పెట్టుబడిదారులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఎఫెక్ట్ అంటున్నారు. 2026, జూన్ 23వ తేదీ ఉదయం సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ కోస్పి (KOSPI) తీవ్ర నష్టాల్లో ప్రారంభం అయ్యింది. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల షేర్లు దారుణంగా పడ్డాయి. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI భారీ స్థాయిలో దూసుకొస్తుందన్న ఉద్దేశంతో.. చిప్ మేకింగ్ కంపెనీల నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఏఐ ప్రభావంతో భవిష్యత్ లో చిప్ తయారీ ఇండస్ట్రీకి గడ్డుకాలం అనే ఉద్దేశంతో తమ షేర్లను అమ్మేశారు ఇన్వెస్టర్లు. ఈ క్రమంలోనే శాంసంగ్ షేర్లు 11 శాతం, హైనిక్స్ కంపెనీ షేర్లు 9 శాతం నష్టపోయాయి. 

దక్షిణి కొరియా స్టాక్ మార్కెట్ ఓవర్ ర్యాలీ.. అంటే వాస్తవం కంటే అధికంగా ర్యాలీ అవుతుందన్న ఆందోళనలు, భయంతో పెట్టుబడిదారులు తమ షేర్లను పెద్ద సంఖ్యలో అమ్మకానికి పెట్టారు. ఓ వైపు చిప్ తయారీ కంపెనీల షేర్లలో అమ్మకాలు.. మరో వైపు స్టాక్ మార్కెట్ ఓవర్ ర్యాలీ భయాలతో సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. 

స్టాక్ మార్కెట్ నష్టాలను తగ్గించటానికి.. ఇన్వెస్టర్ల అమ్మకాలకు బ్రేక్ వేయటానికి ఏకంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ను నిలిపివేశారు. 20 నిమిషాలు అమ్మకాలు, కొనుగోళ్లకు బ్రేక్ వేశారు. తిరిగి ప్రారంభం అయిన తర్వాత కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది సౌత్ కొరియా స్టాక్ మార్కెట్. 

దీనికితోడు ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ షేర్ విలువ ఒక్క రోజులోనే 16 శాతం పడింది. దీని ఎఫెక్ట్ కూడా సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ పై పడింది. ఓవరాల్ గా సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ లో మూడు గంటల్లోనే 2.6 బిలియన్ డాలర్ల విలువైన షేర్లు అమ్మేశారు పెట్టుబడిదారులు. స్టాక్ మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడిని తగ్గించటానికి ట్రేడింగ్ నిలిపివేత వంటి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండాపోయింది.

©️ VIL Media Pvt Ltd.