వానా కాలం మొదలైంది ఈ సమయంలో చాలా మంది వానల్లో తడిసి ముద్దవుతారు అప్పుడు రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్స్ ను తీసుకోవాలి. వాటిలో ఈ పప్పు కూడా ఒకటి. ఇది తినడానికి కొంచం పుల్లగా ఉన్నా నోటికి మాత్రం కమ్మగా ఉంటుంది. ఈ ఉసిరికాయ పప్పు అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే దీనిని చాలా ఈజీగా చేసుకుని తినొచ్చు.
ఉసిరికాయ పప్పుకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు, 7 ఉసిరికాయలు , నాలుగు పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, అర టేబుల్ స్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు, సరిపడా నీరు , రెండు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువను కూడా తీసుకోవాలి.
ఉసిరికాయ పప్పు తయారీ విధానం: ముందుగా పప్పును బాగా ఉడికించుకోవాలి దీనికోసం మీరు ముందుగా కందిపప్పును ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుని దానిలో కొద్దిగా పసుపు, నాలుగు పచ్చిమిర్చి, తగినంత నీళ్లు వేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే దీనిని పొయ్యి మీదే ఉంచి బాగా మెత్తగా ఉడికించాలి.
ఉసిరికాయలను రెడీ చేసుకోవాలి: మీరు ఉసిరికాయలను బాగా కడిగి చిన్న ముక్కలుగా వీటిని కట్ చేసుకోవాలి. ఇంకా గింజలను తీసి వేసి వీటిని ముక్కలుగా కట్ చేసి 10 నిమిషాలు పాటు వీటిని మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. ఉడికిన పప్పును పప్పు గుత్తితో బాగా మెదపాలి. ఇప్పుడు దీనిలో ఉడికిన ఉసిరికాయ ముక్కలు, ఉప్పు వేసుకోవాలి.
వేడి వేడి అన్నంలో తింటే అదుర్స్ : ఇక చివర్లో పాన్ పెట్టి ఆయిల్ నెయ్యి వేసి దీనిలో ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, నాలుగు కరివేపాకులు వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పోపును పప్పులో పోసి బాగా కలపాలి. 5 నిమిషాలు పాటు బాగా మరిగించాలి. ఇక దీనిని వేడి వేడి అన్నంలో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.




