Reading Time: < 1 minute

SIR పై నిర్లక్ష్యం వద్దు..వారం రోజుల్లో తీరు మార్చుకోవాల్సిందే.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్

Caption of Image.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు  సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గాల్లోSIR నిర్వహణపై కొందరు ఎమ్మెల్యేల తీరు పట్ల సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

SIR పై జరిగిన తాజా సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలపై క్లాస్ తీసుకున్నారు. వారంలోగా ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకోవాలి.. సర్ (SIR) పై నిర్లక్ష్యం వీడాలి. లేకపోతే మీ స్థానంలో మరొకరిని నియమించడానికి కూడా వెనకాడం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ కోసం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం పనిచేయని వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.పార్టీ కోసం కష్టపడకపోతే మాకు అవసరం లేదు.. ఈ విషయంలో ఎంత పెద్ద నాయకుడైనా సరే కఠిన నిర్ణయాలు ఉంటాయి అని తేల్చి చెప్పారు.

కేవలం ఎమ్మెల్యేలకే కాదు.. ఇంచార్జ్ మంత్రులకు సైతం సీఎం రేవంత్ రెడ్డి గట్టి సంకేతాలు పంపారు. ఇంచార్జ్ మంత్రులు కూడా సర్ (SIR) పై పూర్తి బాధ్యత తీసుకోవాలని.. ఒకవేళ పర్యవేక్షణలో విఫలమైతే, అవసరమైతే ఇంచార్జ్ మంత్రులను కూడా మారుస్తామని సీఎం హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

©️ VIL Media Pvt Ltd.