Reading Time: < 1 minute

హిట్ మ్యాన్ ఖాతాలో మరో అరుదైన గౌరవం.. పద్మశ్రీ అవార్డ్ అందుకున్న రోహిత్ శర్మ

Caption of Image.

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. మంగళవారం (జూన్ 23) ఢిల్లీలోని రాష్ట్రీయ భవన్‎లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హిట్ మ్యాన్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. క్రీడా రంగానికి ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుకు రోహిత్ శర్మ ఎంపికైన విషయం తెలిసిందే.

మొదటి విడత అవార్డుల ప్రదానోత్సవ సమయంలో అందుబాటులో లేని రోహిత్ శర్మ..  మంగళవారం (జూన్ 23) అవార్డ్ స్వీకరించారు. దేశ అత్యున్నత నాలుగో పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డ్ అందుకున్న హిట్ మ్యాన్‎కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

►ALSO READ | అలుపెరగని ప్రయత్నమే నిజమైన విజయం..క్రీడాకారులకు సీఎం రేవంత్  ఒలింపిక్ డే విషెస్ 

దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం 2026, జనవరి 25న ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 131 పద్మ అవార్డులలో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్,113 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. ప్రజా జీవితం, కళలు, సినిమా, సాహిత్యం, క్రీడలు, ప్రజా వ్యవహారాలు తదితర రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులకు పురస్కారాలు దక్కాయి.

ఈ సారి పద్మ అవార్డులలో సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్‎ను (మరణానంతరం) పద్మవిభూషణ్ వరించింది. మలయాళ నటుడు, మెగాస్టార్ మమ్ముటి పద్మభూషణ్‎కు ఎంపికయ్యారు. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు క్రీడా విభాగంలో పద్మ శ్రీ దక్కింది.

©️ VIL Media Pvt Ltd.