Reading Time: < 1 minute

ఐర్లాండ్, ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ముందు గాయంతో నితీశ్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌

Caption of Image.

న్యూఢిల్లీ: ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎడమ తొడ కండరాల గాయంతో తెలుగు ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ నితీశ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లకు దూరమయ్యాడు. ఇటీవల అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మూడో వన్డే తర్వాత నితీశ్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు.

దాంతో నిర్వహించిన వైద్య పరీక్షల్లో తొడ కండరాల్లో వాపు ఉన్నట్లు ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐ స్కానింగ్‌‌‌‌‌‌‌‌లో తేలింది. కోలుకోవడానికి కనీసం నాలుగు వారాల టైమ్‌‌‌‌‌‌‌‌ పడుతుంది. నితీశ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ముంబై ప్లేయర్‌‌‌‌‌‌‌‌ సూర్యాన్ష్‌‌‌‌‌‌‌‌ షెడ్జేను జట్టులోకి తీసుకున్నారు. 

©️ VIL Media Pvt Ltd.