Reading Time: 2 minutes
Moto Pad 70 Pro Launch 13 Inch 3 5k 144hz Display Snapdragon 8s Gen 4 And 10200mah Battery

Moto Pad 70 Pro Launch: గత ఏడాది విడుదలైన Moto Pad 60 Proకు అప్డేటెడ్ గా Moto Pad 70 Proను జూన్ 27న అధికారికంగా లాంచ్ చేయనుంది. అధికారిక విడుదలకు ముందే ఈ ప్రీమియం ట్యాబ్లెట్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. ఈ Moto Pad 70 Proలో 13-అంగుళాల MaxVision డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఈ స్క్రీన్ 3.5K రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ టెక్నాలజీతో వీడియోలు మరింత స్పష్టంగా, జీవంతో కనిపిస్తాయి. ట్యాబ్లెట్ కేవలం 6.2 మి.మీ. మందంతో, 589 గ్రా. బరువుతో స్లిమ్ డిజైన్‌లో అందుబాటులోకి రానుంది. ఇది బ్లూ కలర్ వేరియంట్‌లో లభించనుంది.

పనితీరు పరంగా ఇందులో Qualcomm Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌ను అమర్చారు. దీనికి హై-స్పీడ్ LPDDR5X RAM అందించారు. గేమింగ్ లేదా హెవీ మల్టీటాస్కింగ్ సమయంలో వేడిని నియంత్రించేందుకు 3-లేయర్ AI Max కూలర్ సిస్టమ్‌ను అందించారు. కనెక్టివిటీ కోసం Wi-Fi 7, బ్లూటూత్ 6.0 సపోర్ట్‌తో పాటు 2TB వరకు విస్తరించగల microSD కార్డ్ స్లాట్‌ను కూడా కల్పించారు. ఈ ట్యాబ్లెట్‌లో 10,200mAh సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీని అందిస్తున్నారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 15 గంటల వరకు ఆన్‌లైన్ వీడియో ప్లేబ్యాక్, 45 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్ అందుతుందని కంపెనీ తెలిపింది. డివైస్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తున్నప్పటికీ, బాక్స్‌లోనే 68W టర్బో పవర్ ఛార్జర్‌ను అందించనున్నారు.

Moto Pad 70 Pro ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో బాక్స్ నుంచి నేరుగా రానుంది. ఈ ట్యాబ్లెట్‌కు ఆండ్రాయిడ్ 19 వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, 2030 వరకు సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని మోటరోలా హామీ ఇచ్చింది. అలాగే Moto AI ఫీచర్లతో పాటు గూగుల్ సర్కిల్ టూ సెర్చ్, జెమినీ వంటి ఆధునిక AI టూల్స్‌ను కూడా ఇందులో అందిస్తున్నారు. మోటోరోలా స్మార్ట్ కనెక్ట్ ప్లాట్‌ఫామ్ ద్వారా పలు డివైస్‌ల మధ్య సులభంగా కనెక్టివిటీ కల్పించబడుతుంది. ఇందులో క్రాస్-స్క్రీన్ స్ట్రీమింగ్, షేర్డ్ క్లిప్‌బోర్డ్, వేగవంతమైన ఫైల్ ట్రాన్స్‌ఫర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఆడియో అనుభవాన్ని మెరుగుపరచేందుకు JBL ట్యూన్ చేసిన క్వాడ్ స్పీకర్ సెటప్‌ను డాల్బీ ఆటమ్స్ సపోర్ట్‌తో అందిస్తున్నారు. అంతేకాకుండా బాక్స్‌లోనే Moto Pen Pro స్టైలస్‌ను అందించడం విశేషం. ఎంపిక చేసిన వేరియంట్లలో ట్రాక్‌ ప్యాడ్‌తో కూడిన డిటాచబుల్ కీబోర్డ్ కూడా లభించనుంది. దీంతో ట్యాబ్లెట్‌ను PC మోడ్ లో ఉపయోగించి ల్యాప్‌టాప్ తరహా అనుభవాన్ని పొందవచ్చు. దీనిని జూన్ 27 నుంచి భారత మార్కెట్‌లో అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ఫ్లిప్కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా కొన్ని రిటైల్ స్టోర్లలో ఈ ట్యాబ్లెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ధర వివరాలను కంపెనీ లాంచ్ రోజున ప్రకటించనుంది.