Reading Time: < 1 minute

విద్యుత్ సంస్థలప్రైవేటీకరణ అబద్ధం : నవీన్ మిట్టల్

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తారనే అపోహలను నమ్మొద్దని విద్యుత్​శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్​మిట్టల్​ అన్నారు. సోమవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) ప్రతినిధులు సెక్రటేరియెట్‌‌లో ఆయనతో సమావేశమయ్యారు.

జేఏసీ నేతలు థర్డ్ డిస్కమ్, వైటీపీఎస్​ ప్లాంట్​లో ప్రైవేట్ టెండర్లు వంటి అంశాలపై చర్చించారు. నవీన్​ మిట్టల్ ​మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులందరూ సంస్థల అభివృద్ధి, విద్యుత్ రంగ ప్రగతిని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని సూచించారు.సమావేశంలో పీఆర్సీ, ఈపీఎఫ్​, జీపీఎఫ్​ సమస్యలు, వైద్య సదుపాయాలు, పెండింగ్ ప్రమోషన్లకు సంబంధించిన అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించారు. 

©️ VIL Media Pvt Ltd.