Reading Time: < 1 minute

రాహుల్‌ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే,, రాంచందర్‌ ‌రావు ఉద్యోగం ఊడుతుంది : ఆది శ్రీనివాస్

Caption of Image.
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆది శ్రీనివాస్ కౌంటర్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావుకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇస్తే ముందు ఆయ‌న‌ ఉద్యోగం ఊడుతుందని విప్​ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరుతూ రాంచందర్​రావు సీఎం రేవంత్​రెడ్డికి బహిరంగ లేఖ రాయడంపై సోమవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొలిటిక‌ల్ డైవ‌ర్షన్ కోస‌మే రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇప్పించాల‌ని సీఎంకు ఆయన లేఖ రాసినట్టు విమర్శించారు.

రాష్ట్ర ప్రయోజ‌నాల కోసమే కిష‌న్ రెడ్డికి.. రేవంత్ లేఖ రాశారని అన్నారు. ముందుగా మాకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే ఎన్నికలప్పుడు బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయో అడుగుతామన్నారు. కేసీఆర్‌‌కు తెలంగాణ రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ ​చేశారు. 

©️ VIL Media Pvt Ltd.