Reading Time: < 1 minute

FIFA World Cup: బలమైన బెల్జియంను నిలువరించిన ఇరాన్.. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 0–0తో మ్యాచ్ డ్రా..

Caption of Image.

ఇంగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–జిలో జరిగిన మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. బలమైన బెల్జియంను నిలువరించింది. ఫలితంగా ఇరుజట్ల మధ్య జరిగిన లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 0–0తో డ్రా అయ్యింది. రెండు జట్లకు వరుసగా రెండో డ్రా కావడంతో నాకౌట్ ఆశలు క్లిష్లంగా మారాయి. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 66వ నిమిషంలో ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తారెమిని ఫౌల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి కిందపడేయంతో బెల్జియం డిఫెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాథన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్గోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు ఇచ్చారు.

దాంతో బెల్జియం పది మందితో ఆడినా… ఈ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉపయోగించుకోలేకపోయింది. ఇరాన్ కీపర్ అలీరెజా బైరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాండ్ ఏకంగా ఏడు అద్భుత రక్షణలతో జట్టును ఆదుకున్నాడు. బెల్జియం స్టార్ కీపర్ తిబాట్ కోర్టోయిస్ సైతం ఇరాన్ ఆటగాళ్లు చేసిన గోల్ ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకున్నాడు.

ముఖ్యంగా తమ స్టార్ ఆటగాడు మెహదీ తారెమి కొట్టిన ఒక గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వీడియో రివ్యూ ద్వారా ‘ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైడ్’గా ప్రకటించడంతో ఇరాన్ ఆనందం ఆవిరైంది. 1966 తర్వాత ఈ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధిక వయసున్న ఆటగాళ్లతో కూడిన తుది జట్టును బరిలోకి దించి ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరికొత్త రికార్డు సృష్టించింది.  

©️ VIL Media Pvt Ltd.