Reading Time: 2 minutes

బరువు తగ్గాలని ట్రెడ్‌మిల్ పై వాకింగ్ చేస్తున్నారా? ఈ తప్పులు చేస్తే రిజల్ట్ సున్నా!

Caption of Image.

ఈ రోజుల్లో బరువు తగ్గాలన్నా, ఫిట్‌గా మారాలన్నా చాలామంది ఎంచుకునే బెస్ట్ ఆప్షన్ ‘ట్రెడ్‌మిల్’. జిమ్‌కి వెళ్లినా, ఇంట్లోనే వర్కవుట్ ప్లాన్ చేసుకున్నా ట్రెడ్‌మిల్ మీద వాకింగ్, రన్నింగ్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. అయితే, ట్రెడ్‌మిల్ ఎక్కేసి స్పీడ్ పెంచేస్తే సరిపోతుందా ? అంటే.. అస్సలు కాదు అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.

తెలిసో తెలియకో ట్రెడ్‌మిల్ ఉపయోగించేటప్పుడు చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఆశించిన ఫలితం రాకపోగా.. కండరాలు పట్టేయడం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల గాయాల బారిన పడే ప్రమాదం ఉంది. మరి ట్రెడ్‌మిల్ మీద వర్కవుట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఫిట్‌నెస్ ట్రైనర్స్ ఏం సజెస్ట్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం…

*తొందరగా బరువు తగ్గాలి. ఫిట్ అవ్వాలి అని ఆలోచిస్తూ ట్రెడ్ మిల్ మీద రన్నింగ్ చేయొద్దు. పూర్తిగా మనసు పెట్టి కనీసం 20-40 నిమిషాలు రన్నింగ్ చేయాలి. అప్పుడే అనుకున్న రిజల్ట్ వస్తుంది.

*ట్రెడ్ మిల్  మీద వర్కవుట్ చేయడానికి ముందు కచ్చితంగా వామప్ చేయాలి. వామప్ స్కిప్ చేస్తే ట్రెడ్ మిల్ మీద రన్నింగ్ చేసేటప్పుడు గాయాలు అయ్యే ఛాన్స్ ఎక్కువ. అలాగే పరిగెత్తే వేగం కూడా తగ్గుతుంది. 

*పెద్ద అడుగులు వేస్తూ నడవడం, పరిగెత్తడం వల్ల ఇంజ్యూరిస్ రిస్క్, కండరాల మీద ఒత్తిడి పెరుగుతుంది.

*ట్రెడ్ మిల్ మీద వాకింగ్, రన్నింగ్ చేస్తున్నప్పుడు పదేపదే కాళ్లను చూసుకుంటుంటే బ్యాలెన్స్ తప్పుతుంది. దాంతో కిందపడిపోతారు. అలాకాకుండా మెడ, వెన్నెముక నిటారుగా ఉంచి వాకింగ్, రన్నింగ్ చేయాలి.

ALSO READ : రూపాయి ఖర్చు లేకుండా.. వంటింటి చిట్కాలతో ఇన్‌స్టంట్ ఫేస్ వాష్..

*ట్రెడ్ మిల్  ఒకే రకమైన వర్కవుట్స్ కు మాత్రమే పనికొస్తుందని అనుకుంటారు కొందరు. అయితే, ట్రైనర్ సాయంతో ట్రెడ్ మిల్  మీద వెరైటీ ఎక్సర్సైజ్ లు కూడా చేయొచ్చు.

*చాలామంది రన్నింగ్ బెల్ట్ మీద ముందుకీ లేదా వెనక్కీ పరిగెత్తుతారు. ఇలాచేస్తే ట్రెడ్ మిల్  మీద రన్నింగ్ చేసినా ఉపయోగం ఉండదు.

*అలాగే, వర్కవుట్స్ చేసేటప్పుడు  ట్రెడ్ మిల్ బార్ పట్టుకోవద్దు. చేతులను కదిలిస్తూ బాడీ పోశ్చర్ మార్చుకోవాలి. ఇలాచేస్తే, ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. 

*అలాగే ట్రెడ్ మిల్  మీద రన్ చేసేందుకు కంఫర్ట్ గా ఉండే షూ వేసుకోవాలి.

©️ VIL Media Pvt Ltd.