
‘కేజీఎఫ్’ సిరీస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన రాకింగ్ స్టార్ యష్, ఇప్పుడు ‘టాక్సిక్’ మూవీతో మరోసారి పాన్ ఇండియా మార్కెట్ పై దండయాత్రకు సిద్ధమయ్యాడు. అయితే తాజాగా విడుదలైన ‘హానర్ థై ఫాదర్’ పోస్టర్ చూస్తుంటే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ కేవలం యాక్షన్ తోనే హిట్ అవ్వలేదు, రాఖీ భాయ్ తన తల్లికి ఇచ్చిన మాట.. ఆ మదర్ సెంటిమెంట్ ప్రజలను బాగా కనెక్ట్ చేసింది. ఇప్పుడు అదే ఎమోషనల్ ఫార్ములాను నమ్ముకుని యష్ ‘ఫాదర్ సెంటిమెంట్’ తో రాబోతున్నాడా అనే డౌట్ వస్తోంది.
ఈ కథలో ఫాదర్-సన్ రివెంజ్ ట్రాక్ తో పాటు బ్రదర్-సిస్టర్ బాండింగ్, లవ్ స్టోరీ వంటి పలు రకాల ఎమోషనల్ లేయర్స్ ఉండనున్నాయట. లేటెస్ట్ పోస్టర్ కూడా తండ్రి పాత్ర ప్రాధాన్యతను సూచిస్తోంది. అయితే కేజీఎఫ్ లో మదర్ సెంటిమెంట్ వర్కవుట్ అయింది కదా అని, ఇప్పుడూ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తే రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఆడియన్స్ ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ని కాకుండా ‘టాక్సిక్’ ద్వారా సరికొత్త ఎక్స్పీరియన్స్ ని కోరుకుంటున్నారు. ఇక్కడే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పై ప్రెజర్ పెరుగుతోంది. గోవా డ్రగ్ కార్టల్ బ్యాక్ డ్రాప్, పోర్చుగీస్ ఎరా సెట్టింగ్ తో దాదాపు 850 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కేజీఎఫ్ షాడో నుండి బయటపడితేనే గ్రాండ్ సక్సెస్ అవుతుంది.