Reading Time: < 1 minute

కేంద్రాన్ని, బీజేపీని ఎందుకు నిలదీయరు?..కేటీఆర్‌‌‌‌, హరీశ్‌‌పై ఎంపీ చామల మండిపాటు

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అభివృద్ధి కోసం విజన్‌‌తో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు పోతుంటే.. అది సహించలేని కేటీఆర్, హరీశ్ పదే పదే విమర్శలు చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు. ప్రతిపక్షం తరఫున కీలక నేతలుగా ఉన్న కేటీఆర్, హరీశ్‌‌.. తెలంగాణను అభివృద్ధి చేస్తున్న రేవంత్‌‌ను విమర్శిస్తున్నారేగానీ, రాష్ట్రాన్ని పట్టించుకోని కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో అభివృద్ధిని చూడలేనిఈ ఇద్దరు నేతలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డిపై పనిగట్టుకొని తప్పుడు  ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పదేండ్లపాటు అధికారంలో ఉండి సినిమావాళ్లతో అంటకాగిన కేటీఆర్.. ఇప్పుడు రాజకీయ విమర్శల్లో కూడా సినిమా మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రజల జీవితాలు కేటీఆర్‌‌‌‌కు సినిమాల్లా కనిపిస్తున్నాయా అని చామల ప్రశ్నించారు.

©️ VIL Media Pvt Ltd.