Reading Time: < 1 minute
There Is Talk That Ak 47 Is Being Postponed It Is Being Said That The Chances Of It Releasing On October 2nd Are Very Little

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ పరిస్థితులు చూస్తుంటే అందుకు అనుగుణంగా లేవు అనే టాక్ వినిపిస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈ సినిమా విడుదలపై ఒక షాకింగ్ గాసిప్ గట్టిగా వినిపిస్తోంది. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ అనుకున్న సమయానికి రావడం లేదని వాయిదా పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని టాక్ నడుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ లో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయని, కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నారని అక్టోబర్ 2లు షూటింగ్ ఫినిష్ అయ్యే అవకాశం లేదని టాక్. ఒకవేళ ఈ అక్టోబర్ లాంగ్ వీకెండ్ డేట్‌ను గనుక మేకర్స్ మిస్ చేసుకుంటే.. ఆ తర్వాత ఈ ఏడాదిలో సరైన విండో దొరకడం కష్టమేనని ఇండస్ట్రీ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే, ‘AK 47’ చిత్రాన్ని ఏకంగా 2027 సమ్మర్ సీజన్‌కు మాత్రమే పోస్ట్‌పోన్ చేసే అవకాశాలు ఉన్నట్లు గట్టిగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ గాసిప్స్ పై ప్రొడక్షన్ హౌస్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అలాగే ఖండించలేదు. దీంతో వెంకీ ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికే వస్తుందా లేదా లాంగ్ డిలే అవుతుందా అనేది తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.