
తమిళ స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి) ఇంట్లో జరిగిన ఒక హైడ్రామా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. లేటెస్ట్ గా ఆయన ఇంట్లో భారీ చోరీ జరిగిందంటూ వచ్చిన వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. చెన్నైలోని అత్యంత విలాసవంతమైన ఇంజంబాక్కం ప్రాంతంలో జయం రవి నివసిస్తున్నారు. అయితే, సోమవారం రోజున ఆయన ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి డ్యూటీకి వచ్చి, ఆ తర్వాత కనిపించకుండా పోవడంతో ఈ రచ్చ మొదలైంది.
ఇంట్లో చోరీ..
వెంటనే అలర్ట్ అయిన రవి మేనేజ్‌మెంట్ టీమ్… సదరు హౌస్ హెల్ప్ రావడం లేదంటూ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగకుండా, ఇంట్లో ఉండాల్సిన రూ. 10 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్, రూ. 40,000 క్యాష్ మాయమయ్యాయని, ఆ హౌస్ హెల్పే దొంగతనానికి పాల్పడిందని ఆరోపించింది.
ట్విస్టుల మీద ట్విస్టులు!
అయితే ఈ కేసులో అసలు ట్విస్ట్ ఏంటంటే… సమాచారం అందుకున్న నీలాంగరై పోలీసులు జయం రవి ఇంటికి వెళ్లి చూసేసరికి అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. దొంగతనం అనుమానంతో ఒక చిన్న బాలుడిని, ఇద్దరు మహిళా పనిమనుషులను ఇంట్లోనే బంధించి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో షాకైన పోలీసులు… చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, ఎవరినీ ఇలా ప్రైవేట్‌గా బంధించి విచారించే హక్కు లేదని నొక్కి చెప్పారు. దొంగతనం జరిగితే సరైన ఆధారాలతో అధికారికంగా కంప్లైంట్ ఇవ్వాలని సూచిస్తూ, ఆ బంధీలందరినీ పోలీసులు సురక్షితంగా బయటకు పంపించేశారు.
వివాదాల సుడిగుండం..
జయం రవి కేవలం ఈ చోరీ కేసుతోనే కాదు, గత కొంతకాలంగా తన పర్సనల్ లైఫ్‌తోనూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తన భార్య ఆర్తి రవితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఈ జంటకు ఆరవ్, అయాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రముఖ హీలర్ కమ్ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో ఒక వెడ్డింగ్‌లో జయం రవి జంటగా కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ గుప్పుమన్నాయి. అయితే మే 2025లో తన మాజీ భార్య ఆర్తి తనపై డొమెస్టిక్ అబ్యూస్ కు పాల్పడిందంటూ రవి సంచలన ఆరోపణలు చేశారు.
ఈ దొంగతనం, బంధీల వ్యవహారం జరిగినప్పుడు జయం రవి ఇంట్లోనే ఉన్నారా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. అటు హీరో వైపు నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ రాలేదు. కెరీర్ పరంగానే కాకుండా, ఇలా వరుస వివాదాలతో జయం రవి పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.