
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గిన ధరలు.. ఆ తర్వాత పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. ప్రతిరోజు గోల్డ్, సిల్వర్ ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే.. అయితే.. ఇరాన్ – అమెరికా యుద్ధం, పలు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులతో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. ఇటీవల తగ్గిన ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. మంగళవారం (జూన్ 23, 2026 ) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.10 పెరిగి.. రూ.1,46,520 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి.. రూ.1,34,310 గా ఉంది.
వెండి కిలో ధరపై రూ.100 తగ్గి రూ.2,49,900 లు గా ఉంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
- హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,520, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,34,310 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.
- విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,46,520, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,34,310 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,46,670, 22 క్యారెట్ల ధర రూ.1,34,460 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,46,520, 22 క్యారెట్ల ధర రూ.1,34,310 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.148,360, 22 క్యారెట్ల ధర రూ.1,35,990 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,46,520, 22 క్యారెట్ల ధర రూ.1,34,310 ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..