Reading Time: 2 minutes
Aadhaar Card: ఆధార్ కార్డు వాడేవారికి భారీ గుడ్ న్యూస్.. ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.. ఆరు నెలలే టైమ్..

ఆధార్ కార్డు ఉన్నవారికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) భారీ ఊరట కలిగించింది. ఈమెయిల్ అప్డేట్ చేసుకోవడానికి విధిస్తున్న ఛార్జీలను తాత్కాలికంగా తొలగించింది. జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు ఆరు నెలల పాటు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కానీ ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఇమెయిల్ అప్‌డేట్‌ చేసుకుంటేనే ఇవి వర్తిస్తుంది. వెబ్‌సైట్ లేదా ఆఫ్‌లైన్‌లో ఆధార్ సెంటర్లకు వెళ్లి అప్డేట్ చేసుకోవాలంటే ఛార్జీలను వసూలు చేస్తారు. అదే ఆధార్ యాప్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ముఖ్యమైన నోటిఫికేషన్లను వినియోగదారులు తక్షణం పొందేందుకు ఈమెయిల్ ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఈమెయిల్ అప్డేట్ చేసుకునేందకు రూ. 75 సర్వీస్ ఛార్జీ విధిస్తున్నారు. కొత్తగా యూఐడీఏఐ లాంచ్ చేసి యాప్ ద్వారా చేసుకుంటే ఇక నుంచి ఆరు నెలల పాటు ఎలాంటి ఛార్జీలు ఉండవు.

రూ.75 ఛార్జీ మాఫీ

“కొత్త ఆధార్ యాప్ ద్వారా ద్వారా ఇమెయిల్ అడ్రస్ అప్డేట్ చేసుకునేందుకు విధిస్తున్న రూ.75 ఛార్జీని మాఫీ చేస్తున్నాం.జూలై 1, 2026 నుండి డిసెంబర్ 31, 2026 వరకు ఆరు నెలల పాటు ఈ సేవను ఉచితంగా అందించాలని నిర్ణయించాం. ప్రస్తుతం ఆధార్ వినియోగదారులు తమ ఇమెయిల్ చిరునామాను అప్‌డేట్ చేసుకోవడానికి రూ. 75 చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలల ప్రమోషనల్ వ్యవధిలో ఈ ఛార్జీ పూర్తిగా తొలగిస్తున్నాం. మీ ఇమెయిల్ ఐడి మీ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటే.. మీరు అన్ని ముఖ్యమైన నోటిఫికేషన్‌లను సకాలంలో పొందవచ్చు. ఇది మిమ్మల్ని అప్‌డేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది” అని యూఐడీఏఐ స్పష్టం చేసింది. అయితే ఈ గడువు ముగిశాక యూఐడీఏఐ మళ్లీ సమీక్ష నిర్వహించి.. ఈ సదుపాయాన్ని మళ్లీ పొడిగించాలా లేదా రుసుమును విధించాలా అనేది నిర్ణయించనుంది.

ఎలా అప్డేట్ చేసుకోవాలి..?

-గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఆధార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

-ఆధార్ నెంబర్, ఆరు అంకెల పిన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి

-హోమ్ పేజీలో సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేయండి

-ఈమెయిల్ అప్డేట్ ఆప్షన్ ఎంచుకోండి

-కొత్త ఈమెయిల్ ఎంటర్ చేయండి

ఆధార్ మొబైల్ యాప్‌లో ఏయే సేవలు పొందవచ్చు?

మొబైల్ నంబర్ అప్‌డేట్, అడ్రస్ అప్‌డేట్, బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్, ఆధార్ వెరిఫైయబుల్ క్రెడెన్షియల్‌ను ఎంపిక చేసుకుని షేర్ చేయడం, అథెంటికేషన్ హిస్టరీని చెక్ చేయడం, ఇ-ఆధార్ డౌన్‌లోడ్, కాంటాక్ట్ కార్డ్ షేర్ చేయడం, ట్రాక్ మై రిక్వెస్ట్ మొదలైన వివిధ సేవలు అందుబాటులో ఉన్నాయి