
ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా DR కాంగోతో జరిగిన గ్రూప్ స్టే్జ్ మ్యాచులో ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డ్ పూర్తిగా తేలిపోయాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రొనాల్డ్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు. రొనాల్డ్ విఫలం కావడంతో పసికూన కాంగోతో 1-1 తేడాతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
కాంగోపై ఘోరమైన ప్రదర్శన తర్వాత అతడిని జట్టు నుండి తొలగించాలని.. ఇకపై రొనాల్డ్ తుది జట్టులో ఉండకూడదని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఉజ్బెకిస్తాన్‌తో జరగనున్న కీలక మ్యాచులో ఈ దిగ్గజాన్ని పక్కకు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉజ్బెకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ కోసం రొనాల్డోను తుది జట్టు నుండి తప్పిస్తారా అనే ప్రశ్నకు పోర్చుగల్ హెడ్ కోచ్ రాబర్టో మార్టినెజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
►ALSO READ | ఇంగ్లాండ్ గడ్డపై తెలుగు అమ్మాయి నయా చరిత్ర.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నెంబర్ 1 బౌలర్‌గా శ్రీచరణి
ఉజ్బెకిస్తాన్‌తో మ్యాచ్‌కు సంబంధించిన తుది జట్టు గురించి ఇంకా చర్చించలేదని.. కాబట్టి తుది జట్టులో రొనాల్డ్ ఉంటాడా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేనని సమాధానాన్ని దాటవేశారు. మ్యాచ్‌కు ముందు రోజు తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు. మార్టినెజ్ వ్యాఖ్యలతో తుది జట్టులో రొనాల్డో ఉంటాడా లేదా అనే దానిపై క్లారిటీ రాలేదు.
మా జట్టుకు అతనొక రోల్ మోడల్
రొనాల్డ్ తుది జట్టులో ఉంటాడా లేదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వనప్పటికీ తమ కెప్టెన్‌పై మార్టినెజ్ ప్రశంసల వర్షం కురిపించాడు. 41 ఏళ్ల వయసులోనూ రొనాల్డ్ జట్టు విజయం కోసం తాపత్రయపడుతున్నాడని కొనియాడారు. అతను మా జట్టుకు ఒక రోల్ మోడల్ అని పేర్కొన్నారు. వైఫల్యాల నుంచి తిరిగి ఎలా పుంజుకోవాలి.. ఎలా రాణించాలనేది అతడికి వెన్నతో పెట్టిన విద్య అని రొనాల్డ్‌కు మద్దతుగా నిలిచారు.