Reading Time: 2 minutes

కమ్ముకొస్తున్న గాడ్జిల్లా కరువు (ఎల్ నినో).. గాలి మాటలు కాదు ఈ ఫొటోలే సాక్ష్యం…

Caption of Image.

పసిఫిక్ మహాసముద్రంలో భారీ స్థాయిలో ‘గాడ్జిల్లా ఎల్ నినో పరిస్థితులు ఏర్పడుతు న్నట్లు సైంటిస్ట్లు గుర్తించారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన సెంటినెల్ -6 మైఖేల్ ఫ్రైలిచ్ శాటిలైట్ పసిఫిక్ లో భూమధ్యరేఖకు సమీపంలో సాధారణ స్థాయి కంటే ఎక్కువ సముద్ర మట్టాల ను గుర్తించింది. అది పంపిన చిత్రాలు వాతావరణ పరిస్థితులపై మరింత ఆందోళనలు పెంచుతున్నా యి. 

సాధారణంగా సముద్రపు నీరు వేడెక్కినప్పుడు వ్యాకోచించి సముద్ర మట్టం పెరుగుతుంది. ఎంత పెరిగిందన్న దాని ఆధారంగా సముద్ర గర్భంలో ఎంత వేడి నిల్వ ఉందో అంచనా వేయొచ్చు. ప్రస్తు తం మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో నమోదవు తున్న అధిక సముద్ర మట్టాలు ఎల్ నినో తీవ్రంగా బలపడుతున్నట్లు సంకేతం ఇస్తున్నాయి.

గత రికార్డులు బ్రేక్ చేసే అవకాశం

నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ పరిశోధకుల ఆందోళనలు పెంచుతున్న శాటిలైట్ చిత్రాలు ప్రకారం, ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్ లో కనిపిస్తు న్నపరిస్థితులు 1997-98లో నమోదైన అత్యంత శక్తివంతమైన ఎల్ నినో ప్రారంభ దశలను తల పిస్తున్నాయి. ఆ సమయంలో సంభవించిన ఎల్ నినో తీవ్రత దృష్ట్యా దానికి ‘గాడ్జిల్లా ఎల్ నినో’ అనే పేరు వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తుండడంతో దీన్ని కూడా అదే

పేరుతో పిలుస్తున్నారు. అంతేకాదు… ప్రస్తుత -పరిస్థితులు గత రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉందని సైంటిస్ట్లు పేర్కొన్నారు. అప్పట్లో వచ్చిన ఎల్ నినో ప్రపంచవ్యాప్తంగా వరదలు, కరువులు, పంటల నష్టం, టెంపరేచర్లలో మార్పులకు కా రణమైంది. ప్రస్తుతం ఉపగ్రహ డేటా ప్రకారం, పసిఫిక్ లోని వేడి నీటి నిల్వలు తూర్పు దిశగా కదులుతున్నాయి.

ఈ ప్రక్రియ ఇలాగే కొనసా గితే రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనే అవకాశముంది. అలాగే ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసా యం, నీటి వనరులపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని సైంటిస్ట్లు అంటున్నారు. భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశాలపై దీని “ప్రభావం అధికంగా ఉంటుంది.

©️ VIL Media Pvt Ltd.